Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు..!

Gold Loan: ప్రజలకు ఆర్థికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ఉపయోగపడేది బంగారం రుణం. ఇది సమస్యను పరిష్కరించేందుకు..

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jan 27, 2022 | 7:06 AM

Gold Loan: ప్రజలకు ఆర్థికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ఉపయోగపడేది బంగారం రుణం. ఇది సమస్యను పరిష్కరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగారు అభరణాలతో బ్యాంకులో రుణాలు నిమిషాల్లోనే పొందవచ్చు. బంగారంపై రుణాలను జారీ చేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్‌ స్కార్‌లను పరిగణలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణ గ్రహిత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపార యజమానులకు తాత్కాలిక నగదు సమస్యకు లేదా అత్యవసర డబ్బు అవసరం ఉన్నప్పుడు సహాయపడతాయి. బ్యాకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. మణప్పురం, ముత్తూట్‌ ఫైనాన్స్‌ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి.

బంగారం విలువలో ఎంత శాతం రుణం ఇస్తాయి

దీంతో త్వరగా రుణాలు పంపిణీ చేస్తుంటాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లకే రుణం మంజూరు చేస్తాయి. ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. మీ బంగారానికి బ్యాంకుల కంటే ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ విలువ కట్టడమే కారణం. ఉదాహారణకు రుణ తీసుకునే వ్యక్తి వద్ద 20 గ్రాముల బంగారం ఉంటే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రెండు రుణ గ్రహీతకు బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. ఒక బ్యాంక్‌ మీ బంగారాన్ని 10 గ్రాములకు రూ.45,500 చొప్పున ఇస్తుంటే, ఎన్‌బీఎఫ్‌ఎసీ దాన్ని ఎక్కువ విలువైనదిగా పరిగణించవచ్చు. పసిడి రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీ లోహానికి విలువ ఇచ్చేటప్పుడు వేగంగా రుణాలు ఇస్తుంది. ఇక బ్యాంకుల విషయానికొస్తే నిబంధనలను అనుసరించి రుణాలను జారీ చేస్తాయి. కాబట్టి జాప్యం జరిగే అవకాశాలుంటాయి.

ఎలాంటి బంగారంపై రుణాలు ఇస్తారు..

బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలా మంది రుణదాతలు ఈ స్వేచ్ఛత కంటే తక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్‌ బార్స్‌పై రుణాలు ఇవ్వవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు. అయితే చాలా బ్యాంకులు గోల్డ్‌ బార్స్‌పై రుణాలు ఇవ్వవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు. తనఖా పెట్టినప్పుడు అభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో అది స్వేచ్ఛత అడగవచ్చు. బరువుపై పరిమితులూ ఉండవచ్చు. చాలా మంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు. ఇక రుణాలను చెల్లించడంలో చాలా వరకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు. కొన్ని బ్యాంకులు ఆ ఛార్జీలు విధిస్తున్నప్పటికీ రుణంలో శాతం మాత్రమే ఉంటాయి. వాల్యుయేషన్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజులు కూడా ఉండవచ్చు. రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీగా వాయిదాలలో (ఈఎంఐ) చెల్లించవచ్చు. లేదా రుణ కాలపరిమితి ఉన్నంత వరకు వడ్డీని మాత్రమే చెల్లించి చివరలో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు.

రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకపోతే..

రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకెపోతే రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. బంగారం ధర పడిపోతే, రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని మమ్మిల్లి అడుగుతారు. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. అంటే వారి దగ్గరున్న బంగారం విలువ మీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఉండాలి.

ఇవి కూడా చదవండి:

Hyderabad: టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. చిప్‌ల తయారీ దిశగా సెరిమోర్ఫిక్‌ కంపెనీ

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?