Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 25, 2022 | 5:59 AM

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరుతో ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితో కుమార్తెల విద్య, వివాహం వంటి ముఖ్యమైన పని కోసం ఉపయోగించవచ్చు. సుకన్య పథకం కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాతా తెరవవచ్చు.

ఖాతాకు అవసరమైన పత్రాలు:

– ఈ పథకం ఫారమ్‌

– లబ్దిదారుని జనన ధృవీకరణ పత్రం

– లబ్దిదారుని తల్లిదండ్రుల చిరునామా పత్రం

– లబ్దిదారుని తల్లిదండ్రుల ఐడీ పత్రం

– ఆదార్, ఇతర పత్రాలు

పథకం వివరాలు:

► ఈ పథకంలో డిపాజిట్లు ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చేయవచ్చు.

► ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించబడుతుంది.

► ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం, ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 డిఫాల్ట్‌ పెనాల్టీతో కనీసం రూ. 250 చెల్లించాలి.

► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.

►ఈ పథకంలో వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

► పిల్లలకి 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు.

► ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి నుండి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉపసంహరణ చేయవచ్చు.

సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు:

సుకన్య ఖాతాకు ఎవరెవరు అర్హులు: సుకన్య సమృద్ధి యోజన కింద, ఒక సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద భారతదేశంలోని బాలికల పేరుతో ఒక పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. అయితే, కవలలు లేదా త్రిపాది పిల్లలు పుట్టినప్పుడు. సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

వడ్డీ రేట్లు..

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సెక్యూరిటీలపై అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా తీసుకోబడుతుంది. అంటే G-sec. ఈ పథకాన్ని 2014లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఖాతాను 10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్ల పేరు మీద తెరవవచ్చు. ఈ ఖాతా 21 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు.

ఇవి కూడా చదవండి:

ITR Filing: పన్ను పరిధి కంటే తక్కువ ఆదాయం ఉండి ఐటీఆర్‌ దరఖాస్తు చేసుకున్నారా..? కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు

Post Office Savings Scheme: పోస్ట్‌ ఆఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. చేతికి రూ.7 లక్షలు..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?