- Telugu News Photo Gallery Business photos Have you earned less than the taxable amount and applied for ITR? Some benefits can be obtained
ITR Filing: పన్ను పరిధి కంటే తక్కువ ఆదాయం ఉండి ఐటీఆర్ దరఖాస్తు చేసుకున్నారా..? కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు
ITR Filing: వేతనం, వృత్తి, వ్యాపారం, అద్దె ఏ విధంగానైనా ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించిన ఆదాయం ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంటే ..
Updated on: Jan 24, 2022 | 9:22 AM

ITR Filing: వేతనం, వృత్తి, వ్యాపారం, అద్దె ఏ విధంగానైనా ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించిన ఆదాయం ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంటే అదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయాలి. రూ.2.50 లక్షలకు మించి ఆదాయం ఉన్న వ్యక్తులు భారతదేశంలో పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం తప్పనిసరి.

లక్ష రూపాయలకుపైగా విద్యుత్ బిల్లులు, రూ.2 లక్షలకుపైగా విదేశీ ప్రయాణాలకు ఖర్చు చేసేవారు కూడా ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంతో మంది తమ ఆదాయపు పన్ను మినహాయింపుల పరిధిలోనే ఉన్నాము కాబట్టి పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు.

కానీ పన్ను చెల్లించడం, ఐటీఆర్ దాఖలు చేయడం రెండు వేర్వేరు చట్టపరమైన బాధ్యతలు. సెక్షన్ 87A కింద అందుబాటులో ఉన్న రిబేటు కారణంగా నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు మించకపోయినట్లయితే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ఐటీఆరర్‌ని దాఖలు చేయాల్సి రావచ్చు.

ఐటీ రిటర్న్ దాఖలు చేయడం వల్ల రుణలు సులభంగా లభిస్తాయి. రుణ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది. ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డుల విషయంలో మన ఆదాయం తెలుసుకోవడం సంస్థలకు ముఖ్యం. బీమా కవరేజీ ఎంత అందించాలనే దానిని నిర్ధారిస్తాయి. అలాగే వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది. పన్ను దాఖలు అనేది ఆదాయం రుజువుగా చూపించవచ్చు.




