- Telugu News Photo Gallery Business photos Best Mileage Scooters: Best mileage scooter 100 cc with 64kmpl in low budget two wheelers
Best Mileage Scooters: 100 సీసీలో 64 కి.మీ మైలేజ్ అందించే స్కూటర్లు.. టాప్ 3లో ఏమున్నాయంటే?
Budget Scooters: ఈ స్కూటర్లలో ప్రయాణించేవారు 1 లీటర్ పెట్రోల్‌తో 64 కి.మీ మైలేజీని పొందుతారు. ఇందులో టీవీఎస్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
Updated on: Jan 24, 2022 | 10:15 AM

ఇండియన్ టూ వీలర్ సెగ్మెంట్ చాలా పెద్దది. ఇందులో స్కూటర్ల నుంచి మోటార్ సైకిళ్ల వరకు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం 100 సీసీ సెగ్మెంట్‌తోపాటు మెరుగైన మైలేజ్ ఆప్షన్‌లతో వచ్చే కొన్ని స్కూటర్ల గురించి చెప్పబోతున్నాం.

TVS స్కూటీ జెస్ట్ అనేది లైట్ వెయిట్ స్కూటర్. దీనిని కంపెనీ రెండు వేరియంట్‌లతో మార్కెట్లోకి విడుదల చేసింది. దాని ఇంజన్ గురించి మాట్లాడితే కంపెనీ ఇందులో 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది 7.81 PS శక్తితోపాటు 8.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీకి సంబంధించి, ఈ స్కూటీ జెస్ట్ 62 kmpl మైలేజీని ఇస్తుందని TVS పేర్కొంది. TVS స్కూటీ జెస్ట్ ప్రారంభ ధర రూ. 65,416. ఇది దాని టాప్ మోడల్‌ను రూ. 66,318కి అందిస్తుంది.

TVS జూపిటర్: TVS జూపిటర్ స్టైల్, మైలేజ్ కోసం ఇష్టపడే దాని కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్. ఈ స్కూటర్ ఇంజన్ గురించి మాట్లాడితే, ఇది 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 7.88 PS శక్తిని, 8.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ 64 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజ్ ARAIచే ధృవీకరించారు. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 66,998గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 77,773గా లభించనుంది.

హీరో ప్లెజర్ ప్లస్: హీరో ప్లెజర్ ప్లస్ అనేది స్టైలిష్, లైట్ వెయిట్ స్కూటర్. దీనిని కంపెనీ ఇటీవల Xtec అవతార్‌తో పరిచయం చేసింది. ఇది నాలుగు వేరియంట్లలో మార్కెట్‌లోకి విడుదల చేశారు.

స్కూటర్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో పాటు దాని ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఈ స్కూటర్ 63 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 62,220గా ఉంది. దాని టాప్ వేరియంట్ ధర రూ. 71,420గా ఉంది.




