Post Office Savings Scheme: పోస్ట్ ఆఫీసులో అదిరిపోయే స్కీమ్.. చేతికి రూ.7 లక్షలు..!
Post Office Savings Scheme: ప్రస్తుతం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో..
Post Office Savings Scheme: ప్రస్తుతం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా పథకాలను రూపొందించారు. ఇక పోస్టాఫీసుల్లో కూడా రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ శాఖ కూడా అనేక స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో సేవింగ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో చేరాలంటే 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెల8,334 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఈ లెక్కన ఏడాదికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఇలా ఐదు సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే రూ.5 లక్షలు అవుతుంది. ఇక మెచ్చూరిటీ ముగిసిన తర్వాత మీ చేతికి రూ.7 లక్షలు అందుకుంటారు.
7.4 వడ్డీ శాతం:
ఈ స్కీమ్‌లో చేరిన వారు 7.4 శాతం వడ్డీ రేటు ఉంటుంది. దీని ప్రకారం .. మొత్తం రూ.1 లక్ష 85 వేల వడ్డీ వస్తుంది. మొత్తం ఐదు సంవత్సరాలలో రూ.6,85,000 అవుతుంది. ఈ స్కీమ్ కింద వడ్డీ త్రైమాసికానికి లెక్కించబడుతుంది. ప్రతి త్రైమాసికంలో ఖాతాదారుడు రూ9.250 వడ్డీ మొత్తాన్ని పొందుతారు. పోస్టాఫీసులలో ఇలాంటి స్కీమ్‌లను ఎంచుకుంటే మంచి రాబడి వస్తుంటుంది.
ఇవి కూడా చదవండి: