Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితో నెలనెలా పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు

LIC Scheme: ప్రస్తుతం బీమా రంగంలో అనేక ఆఫర్లు ఉన్నాయి. వివిధ రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌..

LIC Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితో నెలనెలా పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 22, 2022 | 1:53 PM

LIC Scheme: ప్రస్తుతం బీమా రంగంలో అనేక ఆఫర్లు ఉన్నాయి. వివిధ రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)లో రకరకాల ఇన్సూరెన్స్‌ పథకాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతినెలా పెన్షన్‌ పొందాలని భావిస్తుంటారు చాలా మంది. ఇలాంటి వారికి ఎల్‌ఐసీలో మంచి స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిల్లో దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అందించే ఒక స్కీమ్ కూడా ఉంది. వీటిల్లో ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి నెల ఆదాయం పొందవచ్చు.

అయితే ఈ ఎల్‌ఐసీ (LIC)సరల్ పెన్షన్ ప్లాన్‌లో పాలసీదారులు ఒక్కసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. సంవత్సరానికి కనీసం రూ.12 వేల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఒక విషయం మీరు ప్రీమియం చెల్లించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీరు చెల్లించే ప్రీమియంను బట్టి ఆదాయం వస్తుంటుంది. అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే.. ఎక్కువ పెన్షన్ వస్తుందని గ్రహించాలి. తక్కువ ప్రీమియం చెల్లిస్తే తక్కువ పెన్షన్ వస్తుంది. అవసరం అనుకుంటే నెలకు రూ.12వేల పెన్షన్‌ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంత పెన్షన్‌ కావాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌ ఎక్కువ చేయాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ సరళ్  ప్లాన్‌లో రెండు ఆప్షన్లు:

ఎల్‌ఐసీ సరల్‌ స్కీమ్‌ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది టేమో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్. జీవించి ఉన్నంత కాలం ఈ పెన్షన్ వస్తుంది. పాలసీదారుడు మరణించిన తర్వాత ప్రీమియం మొత్తాన్ని మళ్లీ నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ ప్లాన్‌ను కేవలం ఒకరు మాత్రమే ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది.

ఇంకోటి జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ విత్ రిటర్న్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్.. ఈ ప్లాన్ భార్యాభర్తలు ఇద్దరిరూ పెన్షన్ పొందవచ్చు. ఈ ఆప్షన్‌లో భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన తర్వాత ప్రీమియం డబ్బులు నామినీకి చెల్లిస్తారు. అలాగే ఏడాదికే కాకుండా నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున కూడా పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. 40 నుంచి 80 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత లోన్ కూడా పొందే సౌకర్యం లభిస్తోంది. పూర్తి వివరాలకు ఎల్‌ఐసీ సిబ్బందిని సంప్రదిస్తే తెలియజేస్తారు.

ఈ స్కీమ్‌ పొందాలంటే..

► పాలసీదారులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పాలసీలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు

► ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ యోజన కింద పెన్షన్‌ పాలసీలో వన్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వెంటనే ప్రారంభం అవుతుంది.

► పాలసీదారులు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్‌ పొందేందుకు ఎంచుకోవచ్చు.

► పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా పాలసీదారులు తమ పెట్టుబడిపై రుణం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Budget 2022: ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్ పరిమితి పెరగనుందా.. బడ్జెట్‌ 2022లో ఎలాంటి నిర్ణయం రానుంది?

Income Tax: మీ తల్లిదండ్రుల ద్వారా పన్ను ఆదా ప్రయోజనం పొందడం ఎలా.. సులువైన మార్గాలు..!