Ulip Taxation Benefits: బీమా పాలసీకి సంబంధించిన కొత్త పన్ను నియమాలు వచ్చాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Ulip Taxation Benefits: 2021-22 బడ్జెట్‌లో యులిప్‌లపై పన్నుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

Ulip Taxation Benefits: బీమా పాలసీకి సంబంధించిన కొత్త పన్ను నియమాలు వచ్చాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2022 | 3:03 PM

Ulip Taxation Benefits: 2021-22 బడ్జెట్‌లో యులిప్‌లపై పన్నుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇందులో చాలా విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సీబీడీటీ (CBDT-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ) నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా యూలిప్ లపై పన్ను నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది. యులిప్‌ల గురించి పెట్టుబడిదారులలో విపరీతైన ఆసక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఇది పెట్టుబడిదారుడికి బీమా, పెట్టుబడి రెండింటి ప్రయోజనాన్ని అందిస్తుంది. పన్నును ఆదా చేయడానికి చాలా మంది వ్యక్తులు యులిప్‌లలో పెట్టుబడి పెడతారు. అయితే, యులిప్‌లపై పన్ను గణనకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పన్ను రహితంగా సంపాదించడానికి యులిప్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు పునరాలోచనో పడాల్సి పరిస్థితి వచ్చింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అంటే CBDT నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు మీరు యులిప్‌ ల ద్వారా పన్ను రహిత ఆదాయాన్ని పొందలేరు. ఇప్పుడు యులిప్‌లలో మూలధన లాభాలను గణించే నియమాలను స్పష్టంగా పేర్కొన్నారు. యులిప్‌లలో పెట్టుబడులు పెట్టేవారు ఈ నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

యులిప్ పాలసీ అంటే ఏమిటి.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(ULIP) అనేది జీవిత బీమా. ఇందులో కస్టమర్‌లు బీమా, పెట్టుబడి ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్లు యులిప్‌లలో పెట్టుబడి పెట్టిన డబ్బు స్టాక్‌లు, బాండ్లు, ఇలాంటి ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది. అయితే, అందులో కొంత భాగం బీమా చేయబడిన వ్యక్తికి జీవిత బీమాను అందించడానికి ఉద్దేశించబడి ఉంటుంది. యులిప్‌లలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి ప్రజల మదిలో అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఒక్కోసారి కొంత మంది ముందు వెనుకా ఆలోచించకుండా పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఆందోళన చెందుతుంటారు.

యులిప్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుంది. యులిప్‌లో పెట్టుబడి పెట్టే ముందు, దానికి సంబంధించి లాభ నష్టాలను భేరీజు వేసుకోవాలి. సరైన అవగాహన ఉంటనే యులిప్‌ల పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

వాస్తవానికి, యులిప్‌లలో వార్షిక పెట్టుబడి రూ. 2.5 లక్షలు దాటితే, రిటర్న్‌పై పన్ను మినహాయింపు లభించదని 2021 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ పెట్టుబడి పరిమితి ఫిబ్రవరి 1, 2021న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన పాలసీలకు వర్తిస్తుందని, మునుపటి యులిప్‌లపై రాబడి పన్ను రహితం అని ప్రకటించింది. అయితే, దీని ఫ్రేమ్‌వర్క్ ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు కోసం కొత్త, పాత యులిప్‌ల మొత్తం ప్రీమియాన్ని కలపడం ద్వారా పన్ను మినహాయింపు పరిగణించబడుతుంది. వార్షిక ప్రీమియం రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు మినహాయింపు ప్రయోజనం అంతకన్నా ఎక్కువ పెట్టుబడిపై అందుబాటులో ఉండదు. దీని ద్వారా వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను వర్తిస్తుంది.

Also read:

Nagarjuna: స‌మంత నాగ‌చైత‌న్య‌ల విడాకులపై మొద‌టిసారి స్పందించిన నాగార్జున‌.. ఏమ‌న్నారంటే..

Astro Tips Saturday: శనివారం రోజున ఈ వస్తువులను కొంటే ఆర్ధిక ఇబ్బందులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

Budget 2022: సుజీత్ లాంటి వారి నిరుద్యోగం ఇతరులపై ఎలా ప్రభావం చూపిస్తుంది..? బడ్జెట్ స్పెషల్ వీడియో..