AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకి 7 రూపాయలు ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్..! పెట్టుబడి ఎలా పెట్టాలో తెలుసుకోండి..?

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏజెన్సీలు ఆకట్టుకునే రాబడిని అందించే సురక్షిత పెట్టుబడులను అందిస్తాయి.

రోజుకి 7 రూపాయలు ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్..! పెట్టుబడి ఎలా పెట్టాలో తెలుసుకోండి..?
Bank
uppula Raju
|

Updated on: Jan 22, 2022 | 3:50 PM

Share

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏజెన్సీలు ఆకట్టుకునే రాబడిని అందించే సురక్షిత పెట్టుబడులను అందిస్తాయి. రిటైర్మెంట్‌ తర్వాత హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి. ఇది అసంఘటిత రంగ ఉద్యోగుల కోసం, వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. అటల్ పెన్షన్ యోజనను 9 మే 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇప్పటివరకు 3.68 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు అటల్ పెన్షన్ యోజనలో చేరారు. మెరుగైన రిటైర్మెంట్‌ కోసం ప్రతి నెలా ఇందులో కొన్ని వందల మంది పెట్టుబడి పెడుతున్నారు. అటల్ పెన్షన్ యోజన, అనేక ఇతర పెన్షన్ పథకాలను నిర్వహించే సంస్థ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల మంది చందాదారులు ఈ పథకంలో చేరారు.

అటల్ పెన్షన్ యోజన ప్రవేశానికి కనీస వయస్సు

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి ప్రారంభించడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. పెట్టుబడిదారులు కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5000 వరకు నెలవారీ పెన్షన్‌ను ఎంచుకోవచ్చు.18 సంవత్సరాల వయస్సు గల పెట్టుబడిదారులు రిటైర్మెంట్‌ చేసినప్పటి నుంచి నెలవారీ రూ.5000 పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 పెట్టుబడి పెట్టాలి. నెలకు రూ.210 పెట్టుబడి అంటే రోజుకు రూ.7కి రూపాయలు. ఏడాదిలో పెట్టుబడిదారుడికి రూ.60,000 పెన్షన్ అందుతుంది. అయితే వ్యక్తికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ. 5000 నెలవారీ పెన్షన్‌ను పొందుతాడు. పెట్టుబడిదారుడు నెలకు రూ. 210 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

పెట్టుబడి ఎలా పెట్టాలి..?

1. అటల్ పెన్షన్ యోజన అధికారిక వెబ్‌సైట్- https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. వ్యక్తిగత, ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేయండి.

3. OTP ద్వారా సమాచారాన్ని ధృవీకరించండి. ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

4. బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి. ఖాతా నంబర్, IFSC కోడ్ తప్పనిసరి

5. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతా యాక్టివేట్ అవుతుంది.

6. నామినీ వివరాలను నమోదు చేసి ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.

7. ఫారమ్‌పై ఈ-సైన్ చేయండి. మీ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?

Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

Amla Powder: ఇమ్యూనిటీని పెంచే ఉసిరి పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.. ఎలాగంటే..?