Aadhaar: ఆధార్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

Aadhaar: ఆధార్‌ ప్రతి ఒక్క భారతీయుడికి అవసరం. ఇది లేనిదే ఏ పని జరుగదు. ఆధార్‌ గుర్తింపును తెలియజేస్తుంది. ఆధార్‌ కార్డు అందించడానికి ప్రభుత్వం అనేక

Aadhaar: ఆధార్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?
Aadhaar 2
Follow us

|

Updated on: Jan 22, 2022 | 4:11 PM

Aadhaar: ఆధార్‌ ప్రతి ఒక్క భారతీయుడికి అవసరం. ఇది లేనిదే ఏ పని జరుగదు. ఆధార్‌ గుర్తింపును తెలియజేస్తుంది. ఆధార్‌ కార్డు అందించడానికి ప్రభుత్వం అనేక ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో ఎన్‌రోల్‌మెంట్, అడ్రస్ మార్పులు, పేరు మార్పులు, పుట్టిన తేదీ మార్పులు వంటి ఆధార్ సంబంధిత పనులు చేసుకోవచ్చు. ప్రతి భారతీయ పౌరుడు వయస్సు, లింగంతో సంబంధం లేకుండా 12 అంకెల ఆధార్ నంబర్ కోసం నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇది జాతీయ ID కార్డ్‌గా పనిచేస్తుంది. ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో తనకు లేదా తన కుటుంబ సభ్యులకు లేదా స్నేహితుడి కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ ఎలా బుక్‌ చేసుకోవాలి..

1. https://uidai.gov.in/ని సందర్శించండి

2. ‘నా ఆధార్’ కింద ‘అపాయింట్‌మెంట్‌ను బుక్ చేయండి’పై క్లిక్ చేయండి

3. ‘UIDAI ఆమోదిత ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేయండి’ అనే ఆప్షన్ ఎంచుకోండి

4. డ్రాప్‌డౌన్ నుంచి మీ నగరం/స్థానాన్ని ఎంచుకోండి

5. ‘అపాయింట్‌మెంట్‌ను బుక్ చేయడానికి కొనసాగండి’పై క్లిక్ చేయండి

6. ‘బుక్ అపాయింట్‌మెంట్’పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి

7. ‘న్యూ ఆధార్’ లేదా ‘ఆధార్ అప్‌డేట్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ‘OTP’ జనరేట్ పై క్లిక్ చేయండి

8. OTPని నమోదు చేసి వెరిఫైపై క్లిక్ చేయండి

9. రాష్ట్రం, నగరం, ఆధార్ సేవా కేంద్రం వంటి అపాయింట్‌మెంట్ వివరాలను నమోదు చేయండి. భాషను ఎంచుకుని, తదుపరి క్లిక్ చేయండి

10. రుజువుతో పాటు వ్యక్తిగత వివరాలు, చిరునామా వివరాలను నమోదు చేసి తదుపరి ట్యాబ్‌ను క్లిక్ చేయండి

11. టైమ్ స్లాట్‌ని ఎంచుకుని తదుపరి క్లిక్ చేయండి.

12. మీ అపాయింట్‌మెంట్‌ బుక్‌ అయినట్లు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్ వస్తుంది.

సమీప నమోదు కేంద్రాన్ని ఎలా గుర్తించాలి

సమీపంలోని నమోదు కేంద్రాన్ని కనుగొనడానికి గూగూల్‌లో సెర్చు చేయవచ్చు. లేదా https://appointments.uidai.gov.in/easearch.aspxని సందర్శించవచ్చు.

అవసరమైన పత్రాలు

అపాయింట్‌మెంట్‌ నమోదు చేయడానికి చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, ఫొటో, చిరునామా రుజువు, పుట్టిన తేదీ రుజువు ఉపయోగించవచ్చు.

ఆధార్ సంబంధిత సేవలకు ఛార్జీలు

1. ఆధార్ నమోదు ఉచితం

2. పిల్లల కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (5 మరియు 15 సంవత్సరాల వయస్సులో) ఉచితం

3. డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌తో లేదా ఏదైనా బయోమెట్రిక్ అప్‌డేట్ రూ.100

4. నివాసితుల ద్వారా మాత్రమే డెమోగ్రాఫిక్ అప్‌డేట్ రూ.50

5. ఆధార్ & కలర్ ప్రింట్ డౌన్‌లోడ్ చేస్తే రూ.30

6. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ అప్‌డేట్లు ఒక అప్‌డేట్‌గా పరిగణిస్తారు

రోజుకి 7 రూపాయలు ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్.. పెట్టుబడి ఎలా పెట్టాలో తెలుసుకోండి..?

మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?

కేంద్రం కీలక నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లపై నిషేధం..?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!