AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?

Women Rights: భారత ప్రభుత్వం మహిళలకు అనేక హక్కులను కల్పించింది. లింగ సమానత్వం, సమాన వాటా, గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు,

మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?
Women Rights
uppula Raju
|

Updated on: Jan 22, 2022 | 3:17 PM

Share

Women Rights: భారత ప్రభుత్వం మహిళలకు అనేక హక్కులను కల్పించింది. లింగ సమానత్వం, సమాన వాటా, గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కు, కార్యాలయంలో వేధింపుల నుంచి రక్షణ మొదలగు హక్కులు ఉన్నాయి. వీటన్నిటిని ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి. ఇబ్బందుల నుంచి గట్టెక్కాలి. భారతదేశంలో లింగ సమానత్వం ఆధారంగా మహిళలకు ఇచ్చిన 11 హక్కుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. సమాన వేతన హక్కు: నిబంధనల ప్రకారం.. జీతం, చెల్లింపు విషయంలో లింగం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండదు. పని చేసే మహిళకు పురుషుడితో పాటు సమానంగా జీతం పొందే హక్కు ఉంది.

2. గౌరవ, మర్యాద హక్కు: మహిళలు గౌరవంగా, మర్యాదగా జీవించే హక్కును కలిగి ఉన్నారు. ఏదైనా సందర్భంలో ఒక మహిళ నిందితురాలిగా ఉంటే ఆమెకు వైద్య పరీక్షలు మరొక మహిళ సమక్షంలోనే జరగాలి.

3. కార్యాలయంలో వేధింపుల నుంచి రక్షణ: భారతీయ చట్టాల ప్రకారం.. ఒక మహిళ కార్యాలయంలో శారీరక వేధింపులకు లేదా లైంగిక వేధింపులకు గురైతే, ఫిర్యాదు చేసే హక్కు ఉంది. ఈ చట్టం ప్రకారం ఒక మహిళ 3 నెలల వ్యవధిలో బ్రాంచ్ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.

4. గృహ హింసకు వ్యతిరేకంగా: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 498 ప్రకారం.. గృహ హింసకు వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించే హక్కు భార్యకి ఉంది. నిందితుడికి మూడేళ్ల నాన్ బెయిలబుల్ జైలు శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

5. గోప్యతను కాపాడే హక్కు: స్త్రీ గోప్యతను కాపాడే హక్కు మన చట్టంలో పొందుపరిచారు. ఒక మహిళ లైంగిక వేధింపులకు గురైనట్లయితే ఆమె జిల్లా మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. ఒక మహిళ పోలీసు అధికారి సమక్షంలో వాంగ్మూలం ఇవ్వవచ్చు.

6. ఉచిత న్యాయ సహాయ హక్కు: లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం ప్రకారం.. అత్యాచార బాధితురాలికి ఉచిత న్యాయ సలహా పొందే హక్కు ఉంది.

7. రాత్రిపూట స్త్రీని అరెస్టు చేయలేం: సూర్యాస్తమయం తర్వాత నిందితులుగా ఉన్న మహిళను అరెస్టు చేయకూడదు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలను మినహాయింపులో ఉంచారు. మహిళా కానిస్టేబుల్ లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో విచారణ చేయాలని చట్టం చెబుతోంది.

8. వర్చువల్ ఫిర్యాదును ఫైల్ చేసే హక్కు: ఏ స్త్రీ అయినా తన ఫిర్యాదును వర్చువల్ పద్ధతిలో నమోదు చేయవచ్చు. ఇందులో ఆమె ఈమెయిల్ సహాయం తీసుకోవచ్చు. ఒక మహిళ కావాలనుకుంటే ఆమె తన ఫిర్యాదును రిజిస్టర్డ్ పోస్టల్ చిరునామాతో పోలీస్ స్టేషన్‌కు లేఖ ద్వారా పంపవచ్చు. దీని తరువాత SHO ఒక కానిస్టేబుల్‌ను మహిళ ఇంటికి పంపుతారు. అతను స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తాడు.

9. అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు: ఏ స్త్రీనైనా అసభ్యకరంగా, కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అలా చేయడం శిక్షార్హమైన నేరం.

10. స్త్రీని వెంబడించకూడదు: IPC సెక్షన్ 354 D ప్రకారం ఒక మహిళ తిరస్కరించినా కూడా పదే పదే వెంబడించడం, లేదా ఇంటర్నెట్, ఈమెయిల్ వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పర్యవేక్షించడం నేరం. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

11. జీరో FIR హక్కు: ఒక మహిళ ఏదైనా పోలీసు స్టేషన్‌లో లేదా ఎక్కడి నుంచైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. ఇందుకోసం ఘటన జరిగిన పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన పోలీస్ స్టేషన్‌కు పంపుతారు.

కేంద్రం కీలక నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లపై నిషేధం.. ఎందుకంటే..?

Viral Photos: ఐదువేల బడ్జెట్‌లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?

ICICI: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తోంది.. కొత్త వడ్డీ రేట్లు తెలుసుకోండి..?