Viral Video: బంగారం పూత పూసిన స్వీట్స్ .. కిలో ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ! వీడియో..
స్వీట్లంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో మిఠాయిలను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ అనేక రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. వేరు వేరు ఫ్లేవర్స్‌తో ఎంతో రుచికరమైన అందమైన మిఠాయిలను తయారు చేస్తుంటారు.
స్వీట్లంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో మిఠాయిలను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ అనేక రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. వేరు వేరు ఫ్లేవర్స్‌తో ఎంతో రుచికరమైన అందమైన మిఠాయిలను తయారు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు మీరు కొన్ని స్వీట్స్ పై వెండి రేకు ఉండడం చూసే ఉంటారు. ఉదాహరణకు కాజూ కట్లీ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బంగారు పూత పూసిన మిఠాయిలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటీ షాకయ్యారా ? కానీ మీరు చదివింది నిజమే. అక్షరాల బంగారంతో పూత పూసిన మిఠాయిల కోసం జనాలు అధిక సంఖ్యలో షాపు వద్దకు వెళ్తున్నారు. ఈ ఢిఫరెంట్ ఎక్కడో విదేశాల్లో అనుకంటే పొరబాటు పడినట్టే.. ఈ బంగారు పూత పూసిన మిఠాయిలు ఎక్కడో కాదండోయ్.. మన దేశంలోనే విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలోని మౌజ్ పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్స్ షాపులో ఈ బంగారు మిఠాయిలను విక్రయిస్తున్నారు. ఒక నిర్ధిష్టమైన స్వీట్ పై బంగారు పూత (గోల్డ్ ఫాయిల్‌తో) పూస్తున్న వీడియో ఇప్పుడు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత దానిపై కొంత కుంకుమ పువ్వును అందంగా అలంకరిస్తున్నారు. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ స్వీట్స్ కేజీ రేట్ రూ. 16,000. ఈ స్వీట్స్ వీడియోను ఫుడ్ బ్లాగర్ అర్జు్న్ చౌహన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మిఠాయిని పెట్టుబడుల కోసం ఉపయోగించాలని ఒకరు కామెంట్ చేయగా.. ఇకపై తాము స్వీట్స్ తినమంటూ మరొకరు కామెంట్ చేశారు. మరీ ఈ గోల్డ్ స్వీ్ట్ తయారీ వీడియోను మీరు చూసేయ్యండి.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

