ICICI: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తోంది.. కొత్త వడ్డీ రేట్లు తెలుసుకోండి..?

ICICI: మీరు భవిష్యత్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకో ముఖ్య సమాచారం. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, కెనరా బ్యాంక్ తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్

ICICI: ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తోంది.. కొత్త వడ్డీ రేట్లు తెలుసుకోండి..?
Fd 2
Follow us

|

Updated on: Jan 20, 2022 | 9:56 PM

ICICI: మీరు భవిష్యత్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకో ముఖ్య సమాచారం. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, కెనరా బ్యాంక్ తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. FDపై బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు జనవరి 20, 2022 నుంచి వర్తిస్తాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. 7 నుంచి 29 రోజుల మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 30 నుంచి 90 రోజుల వ్యవధి కలిగిన FDలపై 3 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 91 రోజుల నుంచి 184 రోజుల వరకు FDలపై 3.5 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. అయితే 185 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధి కలిగిన FD ఖాతాలపై 4.40 శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

కొత్త వడ్డీ రేట్లు

బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒక సంవత్సరం నుంచి 389 రోజుల వరకు ఉన్న FDలకు 5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FD ఖాతాలపై బ్యాంక్ 5.60 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో ఐదేళ్ల FDపై బ్యాంకులో 5.45 శాతం వడ్డీ రేటు ఉంటుంది. దీనిపై ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. ICICI బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లు నాన్-సీనియర్స్ కంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు.

ప్రత్యేక FD పథకం

ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ కింద ప్రస్తుతం ఉన్న 0.50 శాతం అదనపు రేటుతో పాటు, రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కొత్త, పునరుద్ధరణ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు అందిస్తుంది. దరఖాస్తు వ్యవధి 20 మే 2020 నుంచి 8 ఏప్రిల్ 2022 వరకు ఉంది. బ్యాంకులో డిపాజిట్ సమయంలో వడ్డీ రేటు లెక్కిస్తుంది.

Amla Powder: ఇమ్యూనిటీని పెంచే ఉసిరి పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.. ఎలాగంటే..?

Lily Flower: లిల్లీ ఫ్లవర్ సాగుతో అధిక సంపాదన.. తక్కువ ఖర్చు అధిక రాబడి..

Pregnancy: గర్భధారణ సమయంలో మహిళల పాదాలలో వాపు ఉంటుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?