Pregnancy: గర్భధారణ సమయంలో మహిళల పాదాలలో వాపు ఉంటుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

Pregnancy And Child Care: గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. హార్మోన్ల మార్పులవల్ల అనేక రకాల శారీరక , మానసిక సమస్యలు ఏర్పడుతాయి.

Pregnancy: గర్భధారణ సమయంలో మహిళల పాదాలలో వాపు ఉంటుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
Pregnant
Follow us
uppula Raju

| Edited By: KVD Varma

Updated on: Jan 24, 2022 | 10:47 PM

Pregnancy And Child Care: గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. హార్మోన్ల మార్పులవల్ల అనేక రకాల శారీరక , మానసిక సమస్యలు ఏర్పడుతాయి. ఈ సమస్యలలో ఒకటి పాదాలలో వాపు. నిజానికి గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధి కోసం శరీరం చాలా కష్టపడాలి. ఈ పరిస్థితిలో శరీరంలో రక్తం, ద్రవాల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా పాదాలలో వాపు మాత్రమే కాకుండా చేతులు, ముఖంతో సహా శరీరంలోని ఇతర భాగాలపై కూడా వాపు వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువసేపు కూర్చోవడం, నిరంతరం నిలబడడం, ఆహారంలో తక్కువ పొటాషియం తీసుకోవడం, కెఫిన్, సోడియం ఎక్కువగా తీసుకోవడం, తక్కువ నీరు తాగడం మొదలైన కారణాల వల్ల కూడా వాపు సంభవించవచ్చు.

గర్భధారణ సమయంలో వాపు సమస్య చాలా సాధారణమైనప్పటికీ దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీరు మీ చేతులు, కాళ్ళలో అకస్మాత్తుగా వాపు ఉంటే దానిని విస్మరించవద్దు వెంటనే నిపుణుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది ప్రీ-ఎక్లాంప్సియా లక్షణం కూడా కావొచ్చు. సాధారణ కారణాల వల్ల వాపు సంభవిస్తే మాత్రం ఈ చిట్కాలను ప్రయత్నించడం వల్ల మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1. నిరంతరం ఒకే స్థితిలో ఉండకండి. నిరంతరం నిలబడకూడదు లేదా నిరంతరం కూర్చోకూడదు. మీరు కూర్చొని పని చేస్తుంటే కొంత సేపు నడవండి. మీరు నిరంతరం నిలబడి ఉంటే కొంచెం సేపు కూర్చుని పని చేయండి.

2. మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటే దానిని తగ్గించండి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీకు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది.

3. పాదాలలో వాపును తగ్గించడానికి మీరు ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను ముంచాలి. ఇది కాకుండా మీరు ఫుట్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.

4. మీ శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో మంట పెరుగుతుంది. దీనిని నివారించడానికి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు.

5. మీకు సమయం దొరికినప్పుడల్లా కొంత సేపు నడవడానికి సమయాన్ని వెచ్చించండి. ఇది కాకుండా కొన్ని సురక్షితమైన వ్యాయామాలు చేయవచ్చు. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి చేతులు, కాళ్ల కణజాలంలో పేరుకుపోయిన ద్రవం బయటకు వస్తుంది.

హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?

Eyes: కళ్ల మంటలు, దురదలు ఇలా చేస్తే మటుమాయం.. ఆస్పత్రి అవసరమే ఉండదు..?

BMW iX EV ఇండియాలో ప్రారంభం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 425 కిలోమీటర్ల ప్రయాణం.. ధర ఎంతంటే..?