హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?

హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?
Corona Medicines

Corona Medicines: దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం చాలా మందిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

uppula Raju

| Edited By: KVD Varma

Jan 24, 2022 | 10:49 PM

Corona Medicines: దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం చాలా మందిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఐసోలేషన్‌లో ఉండడం ద్వారా కోవిడ్ నుంచి కోలుకుంటున్నార. అయితే సోషల్ మీడియా సమాచారం ప్రకారం.. ఎక్కువ మంది ప్రజలు తమకు తాము చికిత్స చేసుకుంటున్నారు. వైద్యుడి సలహా లేకుండా కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను తీసుకుంటున్నాడు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కరోనా మందులు ప్రతి రోగికి అవసరముండవని గుర్తుంచుకోండి.

చాలా మంది కరోనా రోగులు స్వీయ వైద్యం చేసుకుంటున్నారు. తేలికపాటి దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే మోల్నుపిరవిర్, రెమ్‌డెసివిర్ మందులు వేసుకుంటున్నారు. అయితే వైద్యుని సలహా లేకుండా మొలానుపిరవిర్ తీసుకుంటే టెరాటోజెనిసిటీ (అభివృద్ధి చెందుతున్న పిండంలో సమస్యలు), మ్యుటాజెనిసిటీ ( జన్యువులో మార్పులు) సంభవించవచ్చు. ఈ మందులు గుండె మృదులాస్థి, కండరాలను దెబ్బతీస్తాయి. అదేవిధంగా, రెమ్‌డెసివిర్ కూడా వైద్యుల ఖచ్చితమైన పర్యవేక్షణలో తీసుకోవాలి.

కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు, గర్భిణీలు ఈ ఔషధాన్ని తీసుకోవద్దు. ఇది తీవ్రమైన తలనొప్పి, నెమ్మదిగా లేదా వేగవంతమైన హృదయ స్పందన, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం వాపు, వికారం, దురద, ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుంది. మోల్నుపిరావిర్ దుష్ప్రభావాల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీనిని ఉపయోగించమని సిఫారసు చేయడంలో ఆలోచిస్తుంది. ఐసీఎంఆర్ కూడా తన జాబితా నుంచి తొలగించింది. మోల్నుపిరవిర్ లేదా రెమ్‌డెసివిర్ వంటి మందులు అందరి వినియోగం కోసం కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి.

ఔషధం ఎప్పుడు అవసరమో తెలుసుకోండి..

కరోనా సోకినప్పుడు మొదటగా లక్షణాలపై దృష్టి పెట్టాలి. రోగికి దగ్గు, జలుబు లేదా జ్వరం ఉండి శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు అతడు తేలికపాటి లక్షణాలలో బాధపడుతున్నాడని అర్థం. అటువంటి రోగులకు ప్రత్యేక ఔషధం అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడు మాత్రం పారాసిటమిల్ వేసుకుంటే సరిపోతుంది.

వ్యాధి సోకినవారి ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉంటే లేదా ఐదు రోజుల పాటు అధిక జ్వరం ఉన్నట్లయితే వీటిని మితమైన లక్షణాలుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో వైద్యుని సలహా ప్రకారం ఆసుపత్రికి వెళ్లాలి. ఆ సమయంలో ఆక్సిజన్ స్థాయి 90 కంటే తక్కువగా ఉంటే, శ్వాసకోశ రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువగా ఉంటే, అది తీవ్రమైన లక్షణంగా పరిగణిస్తారు. అటువంటి రోగికి తక్షణ ICU మద్దతు అవసరం. అప్పుడు రోగికి మందులు ఇవ్వాలి.

ICMR మార్గదర్శకాలు విడుదల

ICMR కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కరోనా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులను ఐసియులో చేర్పించాలి. ప్రవేశం తర్వాత 24 నుంచి 48 గంటల మధ్య వారికి టోసిలిజుమాబ్ ఔషధాన్ని ఇవ్వవచ్చు. పది రోజులకు పైగా కరోనా లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి.

Eyes: కళ్ల మంటలు, దురదలు ఇలా చేస్తే మటుమాయం.. ఆస్పత్రి అవసరమే ఉండదు..?

BMW iX EV ఇండియాలో ప్రారంభం.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 425 కిలోమీటర్ల ప్రయాణం.. ధర ఎంతంటే..?

షాకింగ్‌.. విరాట్‌ కోహ్లీపై చర్యలకు సిద్దమవుతున్న గంగూలీ.. షోకాజ్ నోటీసు రెడీ..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu