షాకింగ్‌.. విరాట్‌ కోహ్లీపై చర్యలకు సిద్దమవుతున్న గంగూలీ.. షోకాజ్ నోటీసు రెడీ..?

షాకింగ్‌.. విరాట్‌ కోహ్లీపై చర్యలకు సిద్దమవుతున్న గంగూలీ.. షోకాజ్ నోటీసు రెడీ..?
Virat Kohli Sourav Ganguly

Virat kohli Ganguly: గత 3 నుంచి 4 నెలలుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 కెప్టెన్సీ

uppula Raju

|

Jan 20, 2022 | 5:39 PM

Virat kohli Ganguly: గత 3 నుంచి 4 నెలలుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తాజాగా టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బాయ్‌ చెప్పాడు. ఇప్పుడు అతడి గురించి మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు విరాట్ కోహ్లీ నిర్వహించిన విలేకరుల సమావేశం తరువాత BCCI చీఫ్ సౌరవ్ గంగూలీ అతడిపై కోపంగా ఉన్నాడు. దీంతో కోహ్లీకి షోకాజ్ నోటీసు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సౌరవ్ గంగూలీ బీసీసీఐలోని ఇతర సభ్యులతో షోకాజ్‌ నోటీసు అంశంపై చర్చించారు. దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు విరాట్ కోహ్లీ సౌరవ్ గంగూలీపై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని విరాట్ కోహ్లీని కోరినట్లు సౌరవ్ గంగూలీ తెలిపాడు. దానికి బదులుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడాన్ని ఎవరూ ఆపలేరని, అయినా అతడి ఆలోచనను స్వాగతిస్తున్నామని విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ ప్రకటన భారత క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇదే విషయమై సౌరవ్‌ గంగూలీ షోకాజ్ నోటీసును సిద్ధం చేశాడని దానిని విరాట్ కోహ్లీకి పంపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

సౌరవ్ గంగూలీని బోర్డు సభ్యులు అడ్డుకున్నారు..!

విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా మండిపడిన సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే గంగూలీని అలా చేయకుండా బీసీసీఐ సభ్యులు అడ్డుకున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు టెస్ట్ కెప్టెన్‌కు నోటీసు పంపడం బోర్డు సభ్యులకు సరైనది కాదని చెప్పారు. సభ్యుల అభిప్రాయాన్ని సౌరవ్ గంగూలీ అంగీకరించాడు. టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బాయ్‌ చెప్పాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. సౌర‌వ్ గంగూలీతో ఆయ‌న మాట్లాడ‌లేదు. కోహ్లీ తన నిర్ణయాన్ని జట్టులోని ఆటగాళ్లకు తెలిపి ఆ మరుసటి రోజు సోషల్ మీడియాలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

IND VS SA: రిషబ్‌ పంత్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలని డిమాండ్‌..

నిరుద్యోగులకు శుభవార్త.. డంపర్‌ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టులు.. అర్హత పదో తరగతే..?

Panic Attack: చలికాలం పానిక్ అటాక్ ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu