Panic Attack: చలికాలం పానిక్ అటాక్ ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి..?

Panic Attack: పానిక్ అటాక్ లేదా యాంగ్జయిటీ అటాక్ అనేది నేటి యువతలో ఎక్కువగా కనిపించే ఒక వ్యాధి. వ్యాధి అనేదానికంటే ఇది ఒక మానసిక రుగ్మత

Panic Attack: చలికాలం పానిక్ అటాక్ ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి..?
Panic Attack
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2022 | 2:53 PM

Panic Attack: పానిక్ అటాక్ లేదా యాంగ్జయిటీ అటాక్ అనేది నేటి యువతలో ఎక్కువగా కనిపించే ఒక వ్యాధి. వ్యాధి అనేదానికంటే ఇది ఒక మానసిక రుగ్మత అని చెప్పవచ్చు. తెలిసిన లేదా తెలియని కారణాల వల్ల ఒక వ్యక్తి అకస్మాత్తుగా భయపడతాడు. దాని గురించి ఆందోళన చెందుతాడు. జీవితంలో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాల వల్ల కూడా పానిక్ ఎటాక్‌లు వస్తాయి. ఫోబియా కారణంగా ఒక వ్యక్తి కొన్ని విషయాలకు తీవ్రంగా భయపడతాడు. భయాందోళనలకు సంబంధించిన లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.

భయాందోళనకు కారణం ఏమిటి

భౌతిక కారణం: కొన్నిసార్లు మన శరీరంలో సంభవించే కొన్ని వ్యాధులు పానిక్ అటాక్ లేదా ఆందోళనకు కారణం అవుతాయి. ఆరోగ్య నివేదికల ప్రకారం.. గుండెపోటు లేదా గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ రోగులకు కూడా ఈ సమస్య ఎదురవచ్చు.

మానసిక కారణం: భయాందోళనలకు ప్రధాన కారణం మానసిక సమస్యలే. చాలా సార్లు ఒక వ్యక్తి కుటుంబం, వ్యక్తిగత సమస్యలు మొదలైన వాటితో బాధపడుతున్నప్పుడు అతను తన మనసును ఎవరితోనూ షేర్‌ చేసుకోలేనప్పుడు అతను భయాందోళనలకు గురవుతాడు. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు: అకస్మాత్తుగా పెరిగిన గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బీపీ పెరగడం, చెమటలు పట్టడం, శరీరం వణుకుట, తలనొప్పి, శరీరం నొప్పులు, శరీరంలో చలి లేదా వేడి అలలు, తలతిరగడం, వాంతులు, గ్యాస్ లేదా అసిడిటీ వంటివి ఉండటం జరుగుతాయి.

ఇలా రక్షించుకోవచ్చు

1. ప్రతిదాని గురించి సానుకూలంగా ఆలోచించండి. వీలైనంత వరకు టెన్షన్‌కు దూరంగా ఉండండి.

2. సామాజికంగా చురుకుగా ఉండండి ఇతరులతో సన్నిహితంగా మెలగండి.

3. మీ తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి.

4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అంతే కాదు యోగా, ప్రాణాయామం ద్వారా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రశాంతమైన మనస్సుతో యోగా చేయండి.

5. ప్రతిరోజూ ధ్యానం చేయండి. మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే అది ఒత్తిడి లేకుండా ఉండటానికి సహాయపడుతుంది.

6. మీకు అలసట, అశాంతి, తల తిరగడం లాంటివి అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ఏదైనా కారణం వల్ల మీకు భయం లేదా అసౌకర్యంగా అనిపిస్తే మానసిక వైద్యుడిని సంప్రదించండి.

చల్లని వాతావరణం, తీవ్ర భయాందోళనలు

చలికాలంలో దీని సామర్థ్యం అధికంగా పెరుగుతుంది. శీతాకాలంలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది వారు ఎక్కువసేపు నిద్రపోతారు. అందువల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైతే వారిని ఓదార్చండి. వారిని మీలాగే భావించండి. ఆ వ్యక్తికి బాగా ఊపిరి పీల్చుకోమని చెప్పండి. నెమ్మదిగా నీరు తాగిపించండి. ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండటానికి వారి చేతులు, కాళ్ళను రద్దండి. ఇది కాకుండా నిమ్మకాయ, కాఫీ లేదా ఓఆర్ ఎస్ తాగిస్తే మంచిది.

ఆకుకూరలతో ఆరోగ్యం మీ చేతుల్లో.. కరోనాకి దూరంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిందే..!

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ విత్ ఏటీఎమ్‌ కార్డ్‌.. 2 లక్షల ఇన్సూరెన్స్.. ఏ పథకం కింద లభిస్తాయో తెలుసా..?