AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?

Winter Diet: వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు చేయాలి. కీళ్ల సమస్యలు, బరువు పెరగడం, విటమిన్ డి లోపం,

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?
Winter Diet
Follow us
uppula Raju

|

Updated on: Jan 19, 2022 | 7:31 PM

Winter Diet: వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు చేయాలి. కీళ్ల సమస్యలు, బరువు పెరగడం, విటమిన్ డి లోపం, మలబద్ధకం వంటివి చలికాలంలో ప్రజలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు. చర్మం పొడిబారడం, జుట్టు రాలడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మెరిసే చర్మాన్ని, జుట్టుకి బలాన్ని అందిస్తాయి. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా కాపాడుతాయి. శీతాకాలంలో ఆరోగ్యకరమైన, మృదువైన చర్మం కోసం ప్రత్యేకమైన డైట్‌ మెయింటెన్ చేయాలి. అవేంటో తెలుసుకుందాం.

1. నీరు

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారడం, ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇది అలసటకు దారి తీయవచ్చు మీరు ముసలివారిగా కనిపించవచ్చు.

2. కొవ్వు ఆమ్లాలు

వాల్‌నట్‌లు, అవిసె గింజలు, సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఈ ఆహరాలు తింటూ ఉండాలి.

3. క్యారెట్‌

క్యారెట్‌లో బీటా కెరోటిన్, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

4. ఆమ్ల ఫలాలు

శీతాకాలంలో మీరు తాజా జ్యుసి పండ్లను తినవచ్చు. ఇందులో నారింజ, ద్రాక్ష వంటి పండ్లు ఉంటాయి. ఈ విటమిన్ సి-రిచ్ పండ్లు శీతాకాలంలో ఉత్తమ సూపర్ ఫుడ్స్. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

5. చిలగడదుంప

చిలగడదుంపలను ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్ పొటాటోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. చిలగడదుంపలలో ఉండే అధిక స్థాయి బీటా కెరోటిన్ చర్మానికి పోషణను అందించడమే కాకుండా మెరిసేలా చేస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సాధారణ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ విత్ ఏటీఎమ్‌ కార్డ్‌.. 2 లక్షల ఇన్సూరెన్స్.. ఏ పథకం కింద లభిస్తాయో తెలుసా..?

IND Vs SA: దంచికొట్టిన బావుమా, డస్సెన్‌లు.. బిత్తరపోయిన భారత బౌలర్లు.. భారత టార్గెట్‌ 297 పరుగులు

Herbal Tea: గొంతు సమస్యలకు ఈ హెర్బల్‌ టీలు సూపర్.. తక్షణ ఉపశమనం..