Diabetes: మధుమేహం ఉంటే పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటివి ఎంచుకోవాలి.. నిపుణులు ఏమంటున్నారంటే?
మధుమేహం ఉన్నవారు పండ్లు తినవచ్చా. ఒకవేళ తినాలనుకుంటే ఎలాంటి పండ్లు తీసుకోవాలి. ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Fruits For Diabetes: మధుమేహం(Diabetes) ఉన్నవారు తరచుగా సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి కష్టపడతారు. వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు హాని కలిగించని ఆహారాన్ని ఎంచుకోవడం మధుమేహ రోగులకు చాలా అవసరం. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకు కూరలు, చిక్కుళ్లు, పాల ఉత్పత్తులు, గింజలు వంటి ఆహారాలు ఇందులో ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినకూడదని అంటుంటారు. ఎందుకంటే పండ్లలో పోషకాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండ్లు తీసుకోవచ్చు. ముఖ్యంగా పండ్ల ఎంపికల్లో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కొన్ని ప్రాథమిక నియమాలు పాటించాలని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి పండ్లు తీసుకోవాలి? మధుమేహం ఉన్నవారికి కొన్ని ఉత్తమమైన పండ్లను ఎంచుకోవచ్చు. యాపిల్స్, అవకాడోస్, బ్లాక్‌బెర్రీస్, చెర్రీస్, ద్రాక్షపండు, పీచెస్, బేరి, రేగు లేదా స్ట్రాబెర్రీలను ఎంచుకోవచ్చు. వీటిలో తక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఒకవేళ మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడుతుంటే అరటి, మామిడి, పండ్ల రసాలు, ద్రాక్ష వంటి పండ్లకు దూరంగా ఉండాలి.
పండ్లు తినడానికి ఉత్తమ సమయం ఏదీ? మన జీవక్రియ కార్యకలాపాలు రోజులో విభిన్నంగా ఉంటాయి. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు పండ్లు తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయంలో సహాయపడుతుంది. అంటే జీర్ణశక్తి అత్యధికంగా ఉంటే మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పండు తినొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం చేసే ముందు లేదా తర్వాత ఒక పండు తీసుకోవడం మంచింది. ఆటైంలో మన శరీరం అదనపు కార్బోహైడ్రేట్‌లను త్వరగా ఉపయోగించుకోగలవు.
పండ్ల తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పండ్లలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా అవసరం. చక్కెర శోషణను మందగించడంలో, వాటి స్థాయిలను నియంత్రించడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, విటమిన్, ఫైబర్ కోల్పోకుండా ఉండటానికి జ్యూస్‌కు బదులుగా మొత్తం పండ్లను తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇలాంటి పద్దతులు పాటించాలనుకుంటే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
Also Read: Herbal Tea: గొంతు సమస్యలకు ఈ హెర్బల్ టీలు సూపర్.. తక్షణ ఉపశమనం..
Winter Diet: మెరిసే చర్మం కావాలా..? వింటర్ డైట్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..