IND Vs SA: దంచికొట్టిన బావుమా, డస్సెన్‌లు.. బిత్తరపోయిన భారత బౌలర్లు.. భారత టార్గెట్ 297 పరుగులు
IND Vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే బొలాండ్ పార్క్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా
IND Vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే బొలాండ్ పార్క్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి కెప్టెన్ బావుమా, వాన్ డస్సెన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మెల్ల మెల్లగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ భారీ స్కోరు దిశగా కదిలారు. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్ పార్ట్‌నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు.
ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాన్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్ 27 పరుగులు సాధించాడు. భారత్ బౌలర్లు వీరి జంటని విడదీయడంలో విఫలమయ్యారు. ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు.