- Telugu News Photo Gallery Cricket photos BBL 11: Glenn Maxwell hits 64 ball 154 runs Breaks Record Of Highest Score In Big Bash League History
22 ఫోర్లు, 4 సిక్సర్లతో సూపర్ సెంచరీ.. 8గురి బౌలర్ల ఊచకోత.. వీరవిహారం చేసిన కోహ్లీమేట్.!
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2021-22 టోర్నమెంట్‌లోని తన చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్...
Updated on: Jan 19, 2022 | 4:56 PM

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2021-22 టోర్నమెంట్‌లోని తన చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మాక్స్‌వెల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బిగ్ షోగా పిలవబడే మ్యాక్స్‌వెల్ ప్రత్యర్ధి హోబర్ట్ హరికేన్స్‌పై సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అంతేకాదు బిగ్ బాష్ చరిత్రలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు.

హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఓపెనింగ్‌కు దిగగా.. మొదటి బంతి నుంచే బౌలర్లను ఊచకోత కోశాడు. తొలుత 20 బంతులలో అర్ధ శతకం.. ఆ తర్వాత 41 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు మ్యాక్స్‌వెల్.

బిగ్ బాష్ లీగ్‌లో మాక్స్‌వెల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా మ్యాక్సీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ లిస్టులో క్రెయిగ్ సిమన్స్ 39 బంతుల్లో సెంచరీ సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అటు ల్యూక్ రైట్ 44 బంతుల్లో సెంచరీ చేసి మూడో స్థానంలో ఉన్నాడు.

మ్యాక్స్‌వెల్ 62 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, 22 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండగా.. బౌండరీల రూపంలో ఏకంగా 102 పరుగులు రాబట్టాడు.

ఓపెనింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ క్రీజులోకి దిగగా.. సెకండ్ డౌన్‌లో వచ్చిన స్టోయినిస్(75) మ్యాక్సీకి జత కలిసి స్కోర్ బోర్డును వేగంగా ముందుకు కదిలించాడు. ఇరువురు కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా మెల్‌బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 273 పరుగులు చేసింది.




