Pensioners: పెన్షన్ దారులకు శుభవార్త.. ఇప్పుడు జీతంలాగే పెన్షన్.. నెల చివరి రోజు అకౌంట్‌లోకి..

Pensioners: ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) పొందుతున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన

Pensioners: పెన్షన్ దారులకు శుభవార్త.. ఇప్పుడు జీతంలాగే పెన్షన్.. నెల చివరి రోజు అకౌంట్‌లోకి..
Follow us
uppula Raju

|

Updated on: Jan 19, 2022 | 3:28 PM

Pensioners: ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) పొందుతున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వారి పనిని సులభతరం చేసింది. పెన్షన్ కూడా ఇప్పుడు జీతం లాగే అందుబాటులో ఉంటుంది. నెల చివరి తేదీన పెన్షనర్ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటి వరకు నెల మొదటి రోజున పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం.. నెల చివరి తేదీ లేదా చివరి పని రోజు అకౌంట్‌లో డబ్బు జమవుతుంది.

EPFO పెన్షన్ జారీ చేసే బ్యాంకులతో ఒక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం పెన్షనర్ ఖాతాలో డబ్బు జమ చేసే తేదీని నిర్ణయించారు. నెల చివరి రోజు అకౌంట్‌లో పెన్షన్ డబ్బులు జమ చేస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే 5వ తేదీ లోపు కచ్చితంగా పెన్షన్ డబ్బులు జమవ్వాలి. అంటే నిబంధనల ప్రకారం పెన్షన్ డబ్బులు అస్సలు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే నిర్ణీత తేదీలోగా పింఛనుదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ఆధారంగా అన్ని పెన్షన్ కార్యాలయాలు ప్రతినెలా బ్యాంకులకు నెలవారీ స్టేట్‌మెంట్‌లను పంపాలని, ఆ నెల చివరి తేదీలోగా లేదా అంతకు ముందు లబ్ధిదారుల ఖాతాలో బ్యాంకులు డబ్బు జమ చేయాలని సమావేశంలో అంగీకరించారు. మార్చి నెలలో కొంచెం ఆలస్యం కావచ్చు దాని డబ్బును ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత డిపాజిట్ చేయవచ్చు. EPFO అనేక పెన్షన్ పంపిణీ బ్యాంకులతో జతకట్టింది. ఇది పెన్షనర్ ఖాతాలలో డబ్బును డిపాజిట్ చేస్తుంది. పెన్షన్ డబ్బును డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ పంపిణీ చేసే బ్యాంకుల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది.

దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు సర్క్యులర్లు జారీ చేస్తూనే ఉంటుంది. ప్రతి పెన్షనర్ సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ (JPP) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించాలని ఇందులో ఒక నియమం ఉంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్ మంజూరు చేస్తారు. EPFO లైఫ్ సర్టిఫికెట్‌ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు అనేక సౌకర్యాలను కల్పించింది. కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు పెన్షనర్లు సంవత్సరంలో ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ లేదా డిజిటల్ సర్టిఫికేట్‌ను తమ సౌకర్యాన్ని బట్టి బ్యాంకుల్లో సబ్‌మిట్‌ చేయవచ్చు.

Agriculture News: పంట మార్పిడి పాటిస్తే రైతుల ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.. ఎలాగంటే..?

Sleep: బెడ్‌పై ఎప్పుడు ఆ స్థితిలో నిద్రించవద్దు.. పడుకునే పద్దతుల గురించి తెలుసుకోండి..?

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?