Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?

Decoction: కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల కషాయాలు తాగుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివే కానీ ఏదైనా

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?
Decoction
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 7:39 PM

Decoction: కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల కషాయాలు తాగుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివే కానీ ఏదైనా ఎక్కువ తీసుకుంటే హానికరమే అవుతుంది. కషాయాలు కూడా అంతే. అవసరానికి మించి తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల నిపుణుల సలహామేరకు మాత్రమే తీసుకోవాలి. మీరు కూడా కషాయాలు తాగుతున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రాధమిక విషయాలను తెలుసుకోండి.

కషాయం నష్టాలు

ఎండుమిర్చి, అల్లం, దాల్చినచెక్క, పీప్లీ, పసుపు, గిలోయ్, అశ్వగంధ మొదలైన వాటిని డికాషన్‌లో ఉపయోగిస్తారు, ఇది ఒక్కసారి తీసుకుంటే చాలు. మీరు కషాయాన్ని ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, అజీర్ణం, విరేచనాలు, మూత్రంలో మంట, చర్మం పొడిబారడం, నోటిలో పుండ్లు, ముక్కు నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి కషాయాలను సరైన మోతాదులో తీసుకోవడం అవసరం.

కషాయం ఎంత తీసుకోవాలి

ఒక్కసారి అరకప్పు కషాయం తాగితే చాలు. చలికాలంలో మీరు దీన్ని రెండుసార్లు తాగవచ్చు. కానీ చలి తక్కువగా ఉంటే రోజుకు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా రోజు తప్పించి రోజు కషాయం తాగాలి. మూడు వారాల పాటు నిరంతరంగా కషాయాలు తీసుకొని రెండు వారాలు గ్యాప్ ఇవ్వాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికే కషాయం నిరంతరం తాగడం అంత మంచిది కాదు. మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వాలి. ఇది కాకుండా పరగడుపున కషాయాలను తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

ఈ వ్యక్తులు కషాయాన్ని తాగవద్దు

గర్భిణీలు నిపుణుల సలహా లేకుండా కషాయాలను తాగకూడదు. దీని ప్రభావం వేడిగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో గర్భస్రావం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు రక్తాన్ని పలుచన చేసే మందు వేసుకునే వారు కూడా నిపుణుల సలహా లేకుండా కషాయాలను తాగకూడదు. పీరియడ్స్ సమయంలో కషాయాలు తాగితే రక్తస్రావం పెరగవచ్చు. నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోండి. ఇది కాకుండా నీరు ఎక్కువగా తాగాలి. తద్వారా శరీరం వేడిని గ్రహించదు. కషాయం ఎక్కువగా మరగబెట్టకూడదు.

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి..

తక్కువ వ్యవధి ఎక్కువ రాబడి.. టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు