Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువుకు తీవ్ర ప్రమాదం..

Consuming alcohol during pregnancy period: గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో గర్భిణులు తీసుకునే పౌష్టికాహారం

Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువుకు తీవ్ర ప్రమాదం..
Pregnancy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 19, 2022 | 9:07 AM

Consuming alcohol during pregnancy period: గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో గర్భిణులు తీసుకునే పౌష్టికాహారం శిశువును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది నేరుగా పిల్లల ఎదుగుదలపై ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే కడుపులో బిడ్డ తన తల్లి ద్వారా మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. అందుకే గర్భిణులు (pregnancy period) ఆరోగ్యకరమైన ఆహారం (Food) తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అలాగే ఆల్కహాల్ వంటి హానికరమైన వాటికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు నిపుణుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా గర్భధారణ సమయంలో మద్యం తాగుతారు. గర్భధారణ సమయంలో మద్యం తాగడం వల్ల వారి బిడ్డకు (FAS) ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనేది శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఏర్పడిన సమస్యలను పూర్తిగా నయం చేయలేకపోవడం ఆందోళన కలిగించే విషయం అంటున్నారు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (Fetal Alcohol Syndrome) బిడ్డకు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కారణాలు వాస్తవానికి.. గర్భధారణ సమయంలో మద్యం తాగినప్పుడు.. అది వారి పిండంలోకి సులభంగా చేరుతుంది. పిండం కడుపులో పూర్తిగా అభివృద్ధి చెందనందున.. దాని కాలేయానికి ఆల్కహాల్‌ను జీర్ణం చేసే సామర్థ్యం లేదు. ఈ స్థితిలో వారి శరీరంలో ఆల్కహాల్ అక్కడే పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శిశువుకు పూర్తి పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందవు. ఇది పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

FAS వల్ల ఏర్పడే సమస్యలు.. – బలహీనమైన జ్ఞాపకశక్తి – అభ్యాస ఇబ్బందులు – గుండె సమస్యలు – కీళ్లు, అవయవాలు, వేళ్లలో వైకల్యం – మూత్రపిండాలు, ఎముకల సమస్యలు – కంటి, ముక్కు, వినికిడి సమస్యలు – తల చిన్నదిగా ఏర్పడటం.. చురుకు లేకపోవడం – తక్కువ ఎత్తు, తక్కువ బరువు మొదలైనవి..

చికిత్స, నివారణ పద్ధతులు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కారణంగా పిల్లలకి కలిగే శారీరక లేదా మానసిక సమస్యలను నయం చేయలేము. కానీ మనస్తత్వవేత్తలు.. స్పీచ్ థెరపిస్ట్‌లు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌ల సహాయంతో FASతో బాధపడుతున్న పిల్లల సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు. అయితే.. గర్భధారణ సమయంలో మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటమే మేలని.. తద్వారా పిల్లలను ప్రమాదాల నుంచి రక్షించవచ్చని సూచిస్తున్నారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి..

Also Read:

Onion Juice: ఎన్నో సమస్యలకు దివ్యఔషధం.. ఉల్లి రసంతో కిడ్నీ సమస్యలకు చెక్..

Mustard Seeds Benefits: ఆవాలతో ప్రయోజనాలున్నట్లే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయ్.. అవేంటంటే..