Covid Third Wave: దేశంలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరేది ఎప్పుడు? IIT ప్రొఫసర్ ఆసక్తికర విషయాలు వెల్లడి
3rd COVID-19 Wave: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశంలో నిత్యం భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,38,018 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు..
దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్(3rd COVID-19 wave) ఉధృతి కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Varient) ప్రభావంతో దేశంలో నిత్యం భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,38,018 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంగళవారంనాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 310 మంది కోవిడ్ కారణంగా మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. సోమవారంనాటి కోవిడ్ సంఖ్య(2.58 లక్షలు)తో పోల్చితే మంగళవారంనాడు 7 శాతం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం. థర్డ్ వేవ్ ఉధృతి ఎప్పటి వరకు కొనసాగే అవకాశముందన్న అంశంపై పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫసర్ మనీంద్ర అగ్రావాల్ థర్డ్ వేవ్ ఉధృతిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరినట్లు ఆయన వెల్లడించారు. ఈ వారంలోనే మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలోనూ కోవిడ్-19 కేసులు పీక్ స్టేజ్‌కి చేరుతాయని తాను రూపొందించిన సూత్ర మోడల్ ఆధారంగా వెల్లడించారు. మహారాష్ట్రలో జనవరి 19, గుజరాత్‌లో 19, హర్యానాలో 20వ తేదీల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని అంచనావేశారు. ముందుగా ఊహించిన దానికంటే వేగంగా దేశంలో కోవిడ్ విస్తరిస్తున్నట్లు తెలిపారు.
అలాగే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో వచ్చే వారం పీక్ స్టేజ్‌కి చేరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో జనవరి 23న కోవిడ్-19 పీక్ స్టేజ్‌కి చేరుతుందని తెలిపారు. తమిళనాడులో ఈ నెల 25, ఏపీలో ఈ నెల 30న కోవిడ్ కేసులు పీక్ స్టేజ్‌కు చేరుతాయని అంచనావేశారు.
Also Read..
Tesla Plant: టెస్లాకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బీజేపీ పాలిత రాష్ట్రం.. పూర్తి వివరాలు
Jr NTR: ‘చంద్రబాబు మామయ్యా..! మీరు త్వరగా కోలుకోవాలి’.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్