AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurvedic: ఒత్తిడి, ఆందోళన తగ్గించే ఆయుర్వేద మూలికలు.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు..

Ayurvedic: ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. దీంతో చాలా మంది ఒత్తిడికి గురై డిప్రెషన్‌కు

Ayurvedic: ఒత్తిడి, ఆందోళన తగ్గించే ఆయుర్వేద మూలికలు.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు..
Ayurvedic
uppula Raju
|

Updated on: Jan 18, 2022 | 4:16 PM

Share

Ayurvedic: ప్రతి ఒక్కరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. దీంతో చాలా మంది ఒత్తిడికి గురై డిప్రెషన్‌కు లోనవుతారు. ఆహ్లాదకరమైన కార్యకలాపాలు, వ్యాయామం, పౌష్టికాహారం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కేవలం టీ, కాఫీ గురించి మాత్రమే కాదు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. ఈ కోవలోకి అశ్వగంధ, తులసి వంటి మూలికలు వస్తాయి. ఇవి ఏ విధంగా ఒత్తిడిని తగ్గిస్తాయో తెలుసుకుందాం.

1. అశ్వగంధ

అశ్వగంధ మూలికలలో కింగ్‌. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ హెర్బ్ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడి హార్మోన్ల పెరుగుదల ఇతర హార్మోన్లలో అసమతుల్యతను సృష్టిస్తుంది. ఈ మూలికను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వ్యక్తి మానసిక ప్రశాంతతను అనుభవిస్తాడు. దీని కోసం 1 కప్పు పాలు మరిగించి, అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలుపుకొని రాత్రి పడుకునే అరగంట ముందు తాగాలి.

2. లావెండర్

లావెండర్ శతాబ్దాలుగా ఆందోళన, భయానికి సహజ నివారణగా ఉపయోగిస్తున్నారు. ఈ సుగంధ మూలికను సాధారణంగా అరోమాథెరపీకి వినియోగిస్తారు. ఆరోగ్య నివేదికల ప్రకారం.. దాని సుగంధ నూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల ఆందోళన స్థాయి తగ్గుతుంది. సానుకూల అనుభూతిని పొందడానికి మీరు లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక పాత్రలో 1 కప్పు నీటిని మరిగించాలి. దానికి 2 నుంచి 4 చుక్కల లావెండర్ ఆయిల్ కలపాలి. అనంతరం ఆ ఆవిరిని పీల్చుకోవాలి. ఇది మీకు ఒత్తిడి స్థాయిని తగ్గించేలా పనిచేస్తుంది.

3. జీలకర్ర

ఆహారంలో సువాసన కోసం జీలకర్రని ఉపయోగిస్తారు. భారతదేశంలో ఈ మసాలా దాదాపు అన్ని రకాల కూరలలో విస్తృతంగా వాడుతారు. ఐరన్ పుష్కలంగా ఉండే జీలకర్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంలో మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని మరిగించాలి. అర టీస్పూన్ జీలకర్ర తీసుకుని వేడినీటిలో వేయాలి. దీన్ని 2 నిమిషాలు ఉడికించి, తాగాలి. మంచి ఉపశమనం దొరుకుతుంది.

4. తులసి

తులసి మొక్క భారతీయ ఇళ్లలో సులభంగా దొరుకుతుంది. ఒక వ్యక్తి దీర్ఘకాలిక ఒత్తిడితో బాధపడుతుంటే తులసిని తీసుకోవడం వల్ల అతనికి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే ఈ హెర్బల్ ప్లాంట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. మానసిక, శారీరక ఒత్తిడితో పోరాడటానికి తులసిని క్రమం తప్పకుండా ఉపయోగించాలని ఆయుర్వేదంలో సూచించారు. మరోవైపు తులసి ఆందోళన, ఒత్తిడి చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం అరకప్పు నీటిలో 3-5 తులసి ఆకులను వేయాలి. 5-7 నిమిషాలు మరగబెట్టి ఆపై నిమ్మరసం కలుపుకొని తాగాలి.

ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు.. దీని రక్షణ కోసం సెక్యూరిటీ.. ఎందుకంత క్రేజ్‌ అంటే..?

కరోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం.. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ పరీక్ష చేయించుకోండి..

Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..