Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..

Liver Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది పోషకాలను నియంత్రిస్తుంది. ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.

Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..
Liver
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 3:19 PM

Liver Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది పోషకాలను నియంత్రిస్తుంది. ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. శరీరంలో అనేక రకాల విధులని నిర్వహిస్తుంది. జీవక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అందుకే కాలేయాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ 5 డిటాక్స్‌ డ్రింక్స్‌ కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. కాఫీ

ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన పానీయాలలో కాఫీ ఒకటి. ఇప్పటికీ చాలామంది కాఫీతో రోజు ప్రారంభిస్తారు. సరైన మోతాదులో కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేయ కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది.

2. గ్రీన్ టీ

గ్రీన్ టీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్రీన్ టీలోని పోషకాలు కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి. టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. అందుకే ప్రతిరోజు కప్పు గ్రీన్‌ టీ తాగితే చాలా మంచిది.

3. పసుపు టీ

పసుపు ఒక సూపర్ ఫుడ్. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఇందులో ఉండే పోషకాలు శరీరం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజు పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

4. ఉసిరి

ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతాయి. రోజువారి ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వల్ల వ్యాధులన్ని దూరంగా ఉంటాయి.

5. బీట్‌రూట్

బీట్‌రూట్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పెక్టిన్, బీటాలైన్స్, బీటైన్ వంటి పోషకాలు ఉంటాయి. తగినంత మొత్తంలో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్లు A, విటమిన్ సి కూడా ఉంటాయి. ఈ పోషకాలు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతాయి. ప్రతిరోజు పరగడుపున బీట్‌ రూట్‌ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

చలికాలంలో తీపి తినాలనిపిస్తుందా.. ఇంట్లోనే రుచికరమైన బెల్లం అన్నం తయారు చేయండి..

Fashion Tips: చలికాలంలో స్లిమ్‌గా కనిపించాలంటే ఈ సింపుల్‌ ట్రిక్స్‌ తెలుసుకోండి..

మూడేళ్లలో 3 రెట్లు రెమ్యునరేషన్ పెంచేశాడు.. 7 కోట్ల నుంచి 21 కోట్లు..

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..