Sleep: బెడ్‌పై ఎప్పుడు ఆ స్థితిలో నిద్రించవద్దు.. పడుకునే పద్దతుల గురించి తెలుసుకోండి..?

Sleep: ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర ఒత్తిడి లేదా చిరాకుని దూరం చేస్తుంది. ఆ వ్యక్తి తాజాగా, హుషారుగా ఉంటాడు.

Sleep: బెడ్‌పై ఎప్పుడు ఆ స్థితిలో నిద్రించవద్దు.. పడుకునే పద్దతుల గురించి తెలుసుకోండి..?
Sleeping
Follow us
uppula Raju

|

Updated on: Jan 18, 2022 | 8:41 PM

Sleep: ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యం. సుఖమైన నిద్ర ఒత్తిడి లేదా చిరాకుని దూరం చేస్తుంది. ఆ వ్యక్తి తాజాగా, హుషారుగా ఉంటాడు. వాస్తవానికి ప్రజలు తరచుగా తగినంత నిద్రపోతున్నప్పటికీ వారి నిద్రించే విధానం సరిగ్గా ఉండదు. చాలామంది పొట్ట, తల భాగం కిందికి పెట్టి నిద్రించడానికి ఇష్టపడతారు దీని కారణంగా వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతారు. అవేంటో తెలుసుకుందాం.

1. రొమ్ము నొప్పి

చాలా మంది మహిళలు పొట్ట, తలభాగం కిందికి పెట్టి పడుకుంటారు. ఇలా నిద్రపోవడం వల్ల ఛాతిపై, రొమ్ములపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది. మీకు ఇలా జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి అలాగే ఈ రోజు నుంచి ఆ స్థితిలో నిద్రపోవడం మానుకోండి.

2. చర్మ సమస్యలు

కంటి నిండా నిద్రలేకపోతే ఆ ప్రభావం ముఖంపై పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని కారణంగా ముఖ చర్మానికి ఆక్సిజన్ అందదు. అది క్రమంగా పొడిబారుతుంది. ముఖంపై మొటిమలు ముడతలు మొదలవుతాయి.

3. గర్భిణులు

గర్భిణీలు ఎప్పుడు పొట్ట కిందికి పెట్టి పడుకోకూడదు. అది తల్లికి మాత్రమే కాకుండా బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది. అంతే కాదు ఈ పరిస్థితిలో మహిళలు సరిగా నిద్రపోలేరు. గర్భధారణ సమయంలో మహిళలు ఒకవైపునకు తిరిగి పడుకుంటే మంచిది.

4. ఉదర సమస్యలు

స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా కంటినిండా నిద్ర లేకపోతే అనేక ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. బాధిత వ్యక్తికి అజీర్ణం, ఆమ్లత్వం మొదలవుతుంది. అందుకే ఎవ్వరికైనా నిద్ర అనేది చాలా ముఖ్యం.

కాకి తలపై తన్నిందా.. బయటికి వెళ్లేముందు పిల్లి ఎదురైందా.. శకున శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా..?