కాకి తలపై తన్నిందా.. బయటికి వెళ్లేముందు పిల్లి ఎదురైందా.. శకున శాస్త్రం ఏం చెబుతుందంటే..?

కాకి తలపై తన్నిందా.. బయటికి వెళ్లేముందు పిల్లి ఎదురైందా.. శకున శాస్త్రం ఏం చెబుతుందంటే..?
Shakun

Astro News: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని చేయాలన్నా శుభ సమయం, తేదీ మొదలైన వాటిని తెలుసుకొని ప్రారంభిస్తారు. అయితే శుభం,

uppula Raju

|

Jan 18, 2022 | 8:03 PM

Astro News: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని చేయాలన్నా శుభ సమయం, తేదీ మొదలైన వాటిని తెలుసుకొని ప్రారంభిస్తారు. అయితే శుభం, అశుభాలను తెలుసుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. దీని సహాయంతో ఏం జరుగుతుందో అంచనా వేయవచ్చు. శకున్ శాస్త్రం ప్రకారం.. ఏదైనా జంతువు లేదా పక్షి నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా భవిష్యత్తులో జరిగేది మంచి లేదా చెడు అని అంచనా వేయవచ్చు. అయితే అది ఏ విధంగా అనేది వివరంగా తెలుసుకుందాం.

1. శకున్ శాస్త్రం ప్రకారం.. మీరు ఉదయాన్నే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతుంటే మీకు హంస, తెల్ల గుర్రం, నెమలి, చిలుక కనిపిస్తే దానిని శుభ సూచకంగా పరిగణిస్తారు.

2. హిందూ మతంలో ఆవును చాలా పవిత్రమైన జంతువుగా పరిగణిస్తారు. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు దారిలో ఎక్కడైనా ఆవు దూడకు పాలు ఇవ్వడం చూస్తే మీ ప్రయాణం విజయవంతం అవుతుందని అర్థం.

3. శకున్ శాస్త్రం ప్రకారం.. ఏదైనా ఇంట్లో పిల్లి ప్రసవించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సంపదకు సూచిక. అయితే ఇంటి చుట్టూ పిల్లి ఏడుపు విపత్తుకు కారణమవుతుంది. అదేవిధంగా మీరు ముఖ్యమైన పనికోసం బయటికి వెళుతున్నప్పుడు పిల్లి కనిపిస్తే ఆ పనిలో ఆటంకం లేదా వైఫల్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి.

4. కాకి ఇంటిపై అరుస్తూ ఉంటే అతిథి వస్తారని అందరికీ తెలుసు కాని కాకి మీ తలపై లేదా మీ భుజంపై తన్నితే అది చెడు సంకేతంగా భావించాలి. శకున్ శాస్త్రం ప్రకారం.. అది డబ్బు నష్టం లేదా వ్యాధికి సంకేతం.

5. శకున్ శాస్త్రం ప్రకారం.. మీరు ఏదైనా పని కోసం ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు బురదలో బొర్లిన పందిని చూస్తే అది శుభ సూచకం కానీ బురద ఎండిపోయి ఉంటే అది అశుభ సంకేతం.

6. శకున్ శాస్త్రం ప్రకారం.. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ముందు లేదా వెనుక గాడిద శబ్దం చేస్తే దానిని అశుభ సంకేతంగా పరిగణించండి. ఏదైనా పనికి బయలుదేరినప్పుడు గాడిద కనిపిస్తే అది పూర్తి చేయడంలో ఆటంకం ఎదురవుతుందని అర్థం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం శకున్‌ శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గమనించండి.

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?

Jyotish Tips: జ్యోతిష్యం ప్రకారం చక్కెర ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా..?

నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu