AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకుకూరలతో ఆరోగ్యం మీ చేతుల్లో.. కరోనాకి దూరంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిందే..!

Leafy Vegetables: కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తాజా ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో

ఆకుకూరలతో ఆరోగ్యం మీ చేతుల్లో.. కరోనాకి దూరంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిందే..!
Leafy Vegetables
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2022 | 2:33 PM

Leafy Vegetables: కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తాజా ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో ముఖ్యమైనవి ఆకుకూరలు. సాధారణంగా చాలామంది అధిక డబ్బులు ఖర్చు చేసి, మటన్‌, చికెన్‌, చేపలు వంటి నాన్‌వెజ్‌ ఆహారాలను తింటారు. కానీ అందులో లభించే పోషకాలు అన్ని ఆకుకూరల ద్వారా సులువుగా లభిస్తాయి. అంతేకాదు చలికాలం ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మహిళలు, పిల్లలు రెగ్యులర్‌గా తినాలి. అలాంటి కొన్ని ఆకుకూరల గురించి తెలుసుకుందాం.

1. తోటకూర: తోటకూరని తినకుంటే ఎన్నో పోషకాలు మిస్ అవుతున్నట్లే. ఇందులో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు అధికంగా ఉంటాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. విటమిన్‌ A, C, D, E, K, విటమిన్‌ B12, B6 వంటివన్నీ తోటకూరలో ఉంటాయి. రోజూ తోట కూర తింటే బరువు తగ్గుతారు.

2. బచ్చలికూర: పెరట్లో పెరిగే బచ్చలికూర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని పప్సులో వేసి ఎక్కువగా వండుతారు. రుచితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ . కె అలాగే అనేక ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. బచ్చలికూర UV కిరణాల నష్టం నుండి చర్మాన్ని కూడా రక్షిస్తుంది.

3. ముల్లంగి ఆకులు: ముల్లంగి ఆకుల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ముల్లంగి ఆకులు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఇది అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. వారానికి ఒక్కసారి కచ్చితంగా ముల్లంగి ఆకులతో చేసిన వంటకాన్ని తింటే చాలా మంచిది.

4. మెంతికూర: రుచిలో చేదుగా ఉండే మెంతికూరని దాదాపు అందరూ ఇష్టపడతారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మెంతి ఆకులలో ఆస్కార్బిక్ ఆమ్లం, బీటా కెరోటిన్ ఉంటాయి. మెంతులు ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఇది బరువు తగ్గించడంలో వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

5. పాలకూర: ఆకుకూరల్లో పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరమవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు.

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ విత్ ఏటీఎమ్‌ కార్డ్‌.. 2 లక్షల ఇన్సూరెన్స్.. ఏ పథకం కింద లభిస్తాయో తెలుసా..?

Herbal Tea: గొంతు సమస్యలకు ఈ హెర్బల్‌ టీలు సూపర్.. తక్షణ ఉపశమనం..