AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soup for Cold and Cough: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? ఈ 5 సూప్స్‌తో చెక్ పెట్టండి..

Soup for Cold and Cough: కషాయాలు, కొన్ని రకాల కూరగాయలతో చేసిన సూప్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో ఏలాంటి..

Soup for Cold and Cough: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? ఈ 5 సూప్స్‌తో చెక్ పెట్టండి..
Shiva Prajapati
|

Updated on: Jan 20, 2022 | 2:28 PM

Share

Soup for Cold and Cough: కషాయాలు, కొన్ని రకాల కూరగాయలతో చేసిన సూప్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయనడంలో ఏలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని అనే అధ్యయనాలు రుజువు చేశాయి కూడా. ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే జబ్బులు, జలుబు, దగ్గు నుండి బయటపడటానికి కొన్ని సూప్స్ అధ్బుతంగా పని చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే.. సీజనల్‌గా వచ్చే జబ్బులు త్వరగా నయం అవుతాయి. ముఖ్యంగా వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలతో పాటు కాలానుగుణ కూరగాయలను ఉపయోగించి తయారు చేసే సూప్స్ తాగడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 5 రకాల కూరగాయలతో చేసిన సూప్స్ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. జలుబు, దగ్గు సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మరి ఆ 5 రకాల సూప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుమ్మడికాయ సూప్.. ఈ సూప్ తాగడం ద్వారా ముక్కు మూసుకుపోవడం, జలుబు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో ఈ సూప్ అద్భుతంగా ఉంటుంది. గుమ్మడికాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

టొమాటో బాసిల్ సూప్.. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు టొమాటో బాసిల్ సూప్ అద్భుంగా పని చేస్తుంది. ఈ సూప్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఈ టొమాటో బాసిల్ సూప్‌ను వెల్లుల్లి, టొమాటో, తులసి ఆకులతో కలిపి చేస్తారు.

బ్రోకలీ – బీన్ సూప్.. ఈ సూప్ తాగడం ద్వారా కూడా జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలు, బ్రోకలి, బీన్స్ తో కలిపి చేస్తారు. ఇందులో కొద్దిగా పాలు, కార్న్ ఫ్లోర్‌, మిరియాలను కూడా మిక్స్ చేసి సూప్ తయారు చేస్తారు. ఇది తాగడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యాన్ని ఇస్తుంది.

పుట్టగొడుగు సూప్.. మష్రూమ్ సూప్ చాలా పోషకమైనది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది.

వెజిటబుల్ సూప్.. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఇతర కూరగాయలను కలిపి చేస్తారు. దీంట్లో మిరియాలు కూడా కలిపితే సూపర్ టేస్ట్‌తో పాటు.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

Also read:

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నివారించాలంటే.. ఈ ఆహారానికి దురంగా ఉండాల్సిందే..

ICC Ranking: టీమిండియాకు మరో దెబ్బ.. అగ్రస్థానం పాయే.. ఏ స్థానంలో నిలిచిందంటే.!

Jason Roy: 36 బంతుల్లో సెంచరీ.. ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జాసన్ రాయ్ సంచలనం..