AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Roy: 36 బంతుల్లో సెంచరీ.. ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జాసన్ రాయ్ సంచలనం..

ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ జాసన్‌ రాయ్‌ 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ చేశాడు.

Jason Roy: 36 బంతుల్లో సెంచరీ.. ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జాసన్ రాయ్ సంచలనం..
Jason Roy1
Srinivas Chekkilla
|

Updated on: Jan 20, 2022 | 1:54 PM

Share

ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ జాసన్‌ రాయ్‌ 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ చేశాడు. బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ 10 సిక్స్‌లు, 9 ఫోర్లతో సెంచరీ సాధించాడు.

కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టామ్ బాంటన్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 47 బంతుల్లో 115 పరుగులు చేసి జాసన్ రాయ్ ఔటయ్యాడు. అతని సెంచరీ కారణంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్లకు 231 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రెండు నెలల క్రితం, జాసన్ రాయ్ గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ ఆడలేకపోయాడు. జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో 13-13 మంది ఆటగాళ్లు ఆడారు. ప్రెసిడెంట్స్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు పడిపోయాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రాయ్‌తో పాటు బాంటన్ 32, జేమ్స్ విన్స్ 40 నాటౌట్, ఔన్ మోర్గాన్ 22, ఫిల్ సాల్ట్ 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Read Also. IND vs SA: జోరు తగ్గని విరాట్ కోహ్లీ.. టెంబా బావుమాతో వాగ్వాదం.. వైరల్ అయిన వీడియో..