Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నివారించాలంటే.. ఈ ఆహారానికి దురంగా ఉండాల్సిందే..
Health Tips: రోజు రోజుకీ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య అధిక కొలెస్ట్రాల్..
Health Tips: రోజు రోజుకీ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య అధిక కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వలన ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతాయి. LDLని “చెడు కొవ్వు” అని అభివర్ణిస్తారు. ఈ చెడు కొవ్వు ధమనుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కనుక శరీరంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు ఆ ఆహారాలు ఏమిటో.. వాటికీ ఎందుకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
నూనెలో వేయించిన ఆహారాలు: అధిక కొవ్వు సమస్యతో బాధపడుతుంటే అటువంటి వారు నూనెలో వేయించిన పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఉప్పు, ఆయిల్ ఫుడ్స్ లో పోషకాలు ఉండవు. వీటిలోని అధిక కొవ్వు పదార్ధం.. గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉంది.
బేకరీ ఫుడ్స్: ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచే కేకులు, ఐస్ క్రీం, పేస్ట్రీలు, స్వీట్లు బేకరీ ఫుడ్స్ కు దురంగా ఉండడం మంచిది. ఇవి తరచుగా తింటే ఊబకాయానికి దారితీస్తాయి. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బులతో పాటు ఇతర శారీరక వ్యాధులను కూడా కలిగిస్తాయి. వీటిల్లో పోషకాలు తక్కువగా ఉంటాయి.
జంక్ ఫుడ్: తరచుగా ఫాస్ట్ ఫుడ్ తినడం రోగాలు వస్తాయి. ముఖ్యంగా కొవ్వు, ఊబకాయం వంటి శరీరక రుగ్మతలకు దారితీస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. కనుక ఫాస్ట్ ఫుడ్ తినేవారు వీటిని తగ్గించడం వలన అనేక వ్యాధుల నుంచి నివారించుకోవచ్చు.
ప్రాసెస్ చేసిన మాసం: ప్రాసెస్ చేసిన మాసం కంటికి ఇంపుగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. అయితే ఇలా ప్రాసెస్ చేసిన మాసంలో LDL స్థాయిని పెంచే గుణం ఉంది. ముఖ్యంగా సాసేజ్, పంది మాంసం వంటి ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తినడం వలన గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. అంతేకాదు.. కొన్ని కొన్ని సార్లు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్‌ల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
Note: ఈ ఆహార చిట్కాలు పోషకాహార నిపుణులు సూచించిన వాటి ఆధారంగా ఇవ్వబడింది. శరీర తత్వాన్ని బట్టి కూడా తినే ఆహారం ప్రభావం చూపిస్తుంది.
Also Read: