IND VS SA: రిషబ్ పంత్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలని డిమాండ్..
IND VS SA: రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. కానీ సౌతాఫ్రికాతో ఆడిన మొదటి వన్డేలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి
IND VS SA: రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. కానీ సౌతాఫ్రికాతో ఆడిన మొదటి వన్డేలో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే పడింది. పంత్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే వన్డే ఫార్మాట్ విషయానికొస్తే.. ఇతడి ఆటతీరు మరోలా ఉంది. వన్డే ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్‌కు టీమ్ ఇండియా నిరంతరం అవకాశాలు ఇస్తుంది. అయితే ఈ ఆటగాడు పలుమార్లు విఫలమవుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. కానీ టీమిండియా అతని కంటే రిషబ్ పంత్‌ను ఎక్కువగా విశ్వసిస్తుంది. పంత్‌కి ఇప్పటివరకు 19 వన్డేల్లో అవకాశం లభించగా 32.05 సగటుతో 545 పరుగులు చేశాడు. పంత్ స్ట్రైక్ రేట్ 112 కంటే ఎక్కువగా ఉంది. ఇది మిడిల్ ఆర్డర్ ఆటగాడికి అద్భుతమైనది. కానీ బాధ్యతారాహిత్యం వల్ల అతడిపై విమర్శలు వస్తున్నాయి.
రిషబ్ పంత్ ప్రతిభావంతుడు అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ అతడు మిడిల్ ఆర్డర్‌లో ఆడటం కష్టమనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలోనూ అలాంటిదే జరిగింది. పంత్‌కు టీమ్ ఇండియాను గెలిపించే అవకాశం ఉంది అతను16 పరుగులు చేసిన తర్వాత క్రీజులో ఉన్నాడు కానీ లెగ్ సైడ్ వెలుపల వైడ్ బాల్‌లో స్టంప్ అయ్యాడు. ప్రమాదకర షాట్లు ఆడుతూ పంత్ చాలాసార్లు ఔట్ అయ్యాడు. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ను ఎవరు మర్చిపోగలరు?
పంత్ కంటే ఇషాన్ కిషన్ మంచి ఎంపిక..? ఇషాన్ కిషన్ భారతదేశం తరపున 2 ODIలు మాత్రమే ఆడాడు కానీ ఇండియా A గణాంకాలు అతను ఎంత మంచి ఆటగాడో సాక్ష్యమిస్తున్నాయి. ఇషాన్ కిషన్ 76 ఇన్నింగ్స్‌లలో 2609 పరుగులు చేశాడు అతని సగటు సగటు 37. 4 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు పంత్ లిస్ట్ A సగటు 31.12 అతని బ్యాట్‌తో కేవలం ఒక సెంచరీ మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్‌ను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించినప్పటికీ పంత్‌కు టీమిండియాలో అవకాశం వచ్చినప్పుడు అతను ఓపెనింగ్ చేసేవాడు. పంత్ ఆడే ఆటని ఇషాన్ కిషన్ కూడా ఆడగలడు. ఈ ఆటగాడికి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల శక్తి ఉందని అందరు విశ్విసిస్తున్నారు.