Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC పురుషుల టెస్ట్ టీమ్‌లో ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఈ లెజెండ్‌ కెప్టెన్ అయ్యాడు..?

ICC Men Test Team Of The Year 2021: ICC 2021 సంవత్సరానికి పురుషుల టెస్ట్ జట్టును ప్రకటించింది ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు

ICC పురుషుల టెస్ట్ టీమ్‌లో ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఈ లెజెండ్‌ కెప్టెన్ అయ్యాడు..?
Rohit Sharma
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2022 | 3:43 PM

ICC Men Test Team Of The Year 2021: ICC 2021 సంవత్సరానికి పురుషుల టెస్ట్ జట్టును ప్రకటించింది ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. కేన్ విలియమ్సన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్టు జట్టులో అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లు భారత్‌, పాకిస్థాన్‌లు నుంచి ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్ళు, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క ఆటగాడు చోటు దక్కించుకున్నారు. 2021లో టెస్టుల్లో భారత్ అద్భుతాలు చేసింది. 13 టెస్టుల్లో ఎనిమిది గెలిచింది, రెండు ఓడిపోగా మూడు డ్రా అయ్యాయి. ఫలితంగా భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ టెస్టు జట్టులో పాకిస్థాన్‌ నుంచి హసన్‌ అలీ, ఫవాద్‌ ఆలమ్‌, షాహీన్‌ ఆఫ్రిది, శ్రీలంక నుంచి దిముత్‌ కరుణరత్నే, ఆస్ట్రేలియా నుంచి మార్నస్‌ లాబుషాగ్నే, ఇంగ్లండ్‌ నుంచి జో రూట్‌లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ కాకుండా కైల్ జేమిసన్ కూడా జట్టులో భాగమయ్యాడు. గత ఏడాది టెస్టుల్లో పాకిస్థాన్ మంచి ఆటతీరు కనబరిచింది. టీ20, వన్డే తర్వాత టెస్టు జట్టుపై కూడా ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు భారత్ గురించి మాట్లాడినట్లయితే 2021 సంవత్సరంలో టెస్టుల్లో మాత్రమే అత్యుత్తమంగా నిలిచింది. టీ20, వన్డే జట్టులో ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.

Panic Attack: చలికాలం పానిక్ అటాక్ ప్రమాదం ఎక్కువ.. లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి..?

ఆకుకూరలతో ఆరోగ్యం మీ చేతుల్లో.. కరోనాకి దూరంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిందే..!

Winter Diet: చలికాలంలో అందంగా కనిపించాలంటే ఈ 5 సూపర్‌ ఫుడ్స్‌ తినాలి.. ఏంటంటే..?