Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొవిడ్ ఆంక్షల అమలును సర్కార్ పొడిగించింది.
తెలంగాణలో కొవిడ్ ఆంక్షల అమలును సర్కార్ పొడిగించింది. ఈ నెలాఖరు వరకు సభలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈనెలాఖరు వరకు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. కొవిడ్ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఫీవర్ సింటమ్స్ ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో… అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై… కలెక్టర్లకు మినిస్టర్ హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్‌లోనూ వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. పకడ్బందీగా జ్వర సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని హరీశ్… కలెక్టర్లకు సూచించారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు