AP Corona Cases: ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు.. ఆ 2 జిల్లాల్లో కల్లోలం
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు.
ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 47,420 శాంపిల్స్ ని పరీక్షించగా 12,615 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2140056కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా కోవిడ్ వల్ల విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14527కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 53871 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 3,674 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2071658కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,20,12,102 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 2338 వెలుగుచూశాయి. విశాఖలో కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 2117 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..
#COVIDUpdates: 20/01/2022, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,37,161 పాజిటివ్ కేసు లకు గాను *20,68,763 మంది డిశ్చార్జ్ కాగా *14,527 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 53,871#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/6m1UQbxI2D
— ArogyaAndhra (@ArogyaAndhra) January 20, 2022
కరోనా సమాచారం మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
●వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు
సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్