Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్‌ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు

తెలంగాణలోని గవర్నమెంట్ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్‌ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు
Telangana Government
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 20, 2022 | 3:57 PM

తెలంగాణలోని గవర్నమెంట్ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా పెరిగిన డీఏ 2021 జులై 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈనెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ ఉద్యోగులకు అందనుంది. 2021 జులై నుంచి బకాయిలు జీపీఎఫ్‌లో గవర్నమెంట్ జమ చేయనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లుగా డీఏల చెల్లింపులో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీపీఎస్ వర్తించే ఎంప్లాయిస్ కు బకాయిల్లో పది శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమచేస్తారు. మిగతా 90 శాతాన్ని జూన్ నుంచి మూడు దఫాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెరిగిన డీఏ ఫిబ్రవరిలో అందుతుంది. బకాయిలను మే నుంచి ఆరు దఫాల్లో చెల్లిస్తారు.

Also Read: సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్