Amla Powder: ఇమ్యూనిటీని పెంచే ఉసిరి పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.. ఎలాగంటే..?

Amla Powder: దేశంలో కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సమయంలో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

Amla Powder: ఇమ్యూనిటీని పెంచే ఉసిరి పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.. ఎలాగంటే..?
Amla Powder
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2022 | 9:02 PM

Amla Powder: దేశంలో కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సమయంలో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం పోషకాహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. అయితే ఖర్చు ఎక్కువవుతుందనుకునేవారు తక్కువ ఖర్చులో సూపర్ ఐటమ్స్‌ని ఆహారంలో భాగం చేయవచ్చు. అందులో ముఖ్యమైనది ఉసిరి. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది. అందుకోసం ఉసిరి పౌడర్‌ని నిల్వ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే పౌడర్‌ ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. అలాంటి సమయంలో ఇంట్లోనే అధ్భుతమైన ఉసిరి పౌడర్‌ని తయారుచేయవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

తయారు చేసే విధానం..

మార్కెట్ నుంచి 500 గ్రాముల ఉసిరిని కొనుగోలు చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ఒక పాన్‌లో 2 లీటర్ల నీరు, ఉసిరిని వేసి గ్యాస్‌పై ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత చల్లార్చాలి. తర్వాత నీళ్లలోంచి తీసి వాటిలోని గింజలు తీసేయ్యాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో 1-2 రోజులు ఎండబెట్టాలి. బాగా ఎండాక మిక్సీలో వేసి పట్టాలి. అంతే ఉసిరి పౌడర్ రెడీ అయినట్లే. దీనిని నెలల తరబడి సురక్షితంగా ఉంచాలనుకుంటే గాజు పాత్రలో లేదా గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. దీంట్లో ఒక చుక్క నీరు లేదా తడి అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి. అప్పుడే అది చాలాకాలం పాటు తాజాగా ఉంటుంది.

Lily Flower: లిల్లీ ఫ్లవర్ సాగుతో అధిక సంపాదన.. తక్కువ ఖర్చు అధిక రాబడి..

హెచ్చరిక.. కరోనా మందులు ఏ పరిస్థితిలో వాడాలో తెలుసుకోండి.. లేదంటే దుష్పరిణామాలు..?

Pregnancy: గర్భధారణ సమయంలో మహిళల పాదాలలో వాపు ఉంటుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?