AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack: పాక్‌లో మొదలైన భయం.. లష్కరే చీఫ్, జైషే చీఫ్‌లను ఐఎస్‌ఐ సైనిక శిబిరంలో దాచిన పాక్..

ఎవరి ప్రాణాలను అయినా తీయడం చాలా సులభం.. అదే మన వరకూ మరణం వస్తే అన్న ఆలోచన కూడా నచ్చదు.. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తారు.. అది ఉగ్రవాదులైనా సరే అనిపిస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఐఎస్ఐ పరిస్థితి చూస్తే. పహల్గామ్ ఉగ్రవాద సంఘటన తర్వాత.. భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇది పాకిస్తాన్‌లో భయాందోళనలు సృష్టించింది. ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ హెచ్చరించడంతో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జైషే చీఫ్ మసూద్ అజార్ లను పాకిస్తాన్ ఐఎస్ఐ దాచిపెట్టింది.

Pahalgam Attack: పాక్‌లో మొదలైన భయం.. లష్కరే చీఫ్, జైషే చీఫ్‌లను ఐఎస్‌ఐ సైనిక శిబిరంలో దాచిన పాక్..
Hafiz Saeed Masood Azhar
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 10:55 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్యాచరణలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యను తీసుకుంది. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. భారతదేశం తమపై దాడి చేస్తుందని పాక్ ప్రభుత్వం భయపడుతోంది. అదే సమయంలో తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకులను దాచే పనిని కూడా ప్రారంభించింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాద సూత్రధారులు, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, ఉగ్రవాది మసూద్ అజార్‌లను దాచిపెట్టినట్లు తెలుస్తోంది.

సమాచారం ప్రకారం హఫీజ్ సయీద్ పై దాడి జరుగుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. హఫీజ్ సయీద్‌ను ఐఎస్‌ఐ సైనిక శిబిరంలో దాచిపెట్టింది. అతను అబోటాబాద్‌లోని ఐఎస్‌ఐ సేఫ్ హౌస్‌లో దాక్కున్నాడు. అతడిని ఎక్కడికీ వెళ్ళనివ్వడం లేదు. పాకిస్తాన్ ఎంతగా భయపడిందంటే.. ఏప్రిల్ 27న మురిడ్కేలో జరగాల్సిన హఫీజ్ కార్యక్రమాన్ని రద్దు చేసింది. అంతేకాదు ఉగ్రవాది మసూద్ అజార్ కూడా భారత్ దాడి చేస్తుందనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మసూద్ అజార్‌ను ఐఎస్‌ఐ బహవల్‌పూర్‌లో దాచిపెట్టింది.

ప్రధాని మోదీ ప్రజలకు ఏం హామీ ఇచ్చారు?

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారికి ప్రధాని మోడీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ దాగున్నా ఉగ్రవాదులను తుద ముట్టిస్తామని చెప్పారు. దీంతో పాకిస్తాన్ కు చెమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని మధుబనిలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అమాయకమైన పర్యాటకులను దారుణంగా చంపారు. బాధితుల కుటుంబానికి దేశం అండగా నిలుస్తుంది. చాలా మంది చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాద దాడిలో తల్లి దండ్రులు తమ కొడుకును కోల్పోయారు.. స్నేహితుడిని కోల్పోయారు. శత్రువులు భారతదేశ విశ్వాసంపై దాడి చేశారు. నిరాయుధులైన ప్రజలపై దాడి జరిగింది. ఈ దాడి చేసిన ఉగ్రవాదులకు, కుట్ర పన్నిన వారికి వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుంది. మేము ఉగ్రవాదుల భూమిని నేలమట్టం చేస్తాము. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి ఇప్పుడు ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

TRF ను స్థాపించిన హఫీజ్ సయీద్

పహల్గామ్ ఉగ్రదాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. ఈ సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా పాకిస్తాన్ (LET) ఉగ్రవాది హఫీజ్ సయీద్ కి అనుబంధ సంస్థగా పరిగణించబడుతుంది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న లష్కర్ గ్రూపు 2019లో TRF ఒక ఫ్రంట్‌గా ఉద్భవించింది. కాశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలు నిర్వహించడానికి ఇది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సాధనం అని చెబుతున్నారు. ఈ సంస్థ ఆన్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా యువతను నియమించుకోవడంతో పాటు.. కశ్మీర్ లోయలో ఆయుధాలను, మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో ఐఎస్ఐ ఈ సంస్థను పెంచి పోషిస్తోంది.

ఉగ్రవాది మసూద్ అజార్ ఎవరంటే

జైషే మహ్మద్ (జెఎం) వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఉగ్రవాది 2001లో భారత పార్లమెంటుపై దాడి చేశాడు. 2008లో 26/11 ముంబై దాడిలో కూడా సూత్రధారి. ఈ ఉగ్రవాది 2016లో పఠాన్‌కోట్ దాడికి .. 2019లో పుల్వామా దాడికి కూడా సూత్రధారి. అజార్ తన ఉగ్రవాద చర్యల ద్వారా చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ కారణంగానే అతను భారతదేశంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టు లో అగ్రస్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 (IC814)ని హైజాక్ చేసి.. అజార్ ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. విమానంలోని ప్రయాణీకులను రక్షించేందుకు జరగిన ఒప్పదం ప్రకారం అప్పటి భారత అధికారులు అజర్ ని విడుదల చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..