AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: ఇటువంటి వ్యక్తులు జీవితంలో శనీశ్వరుడు అనుగ్రహం పొందలేరు.. ఎందుకంటే

నవ గ్రహాల్లో శని గ్రహానికి ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యుడు, ఛాయల తనయుడు శనీశ్వరుడు కర్మ ఫలదాత అని పిలుస్తారు. ఎందుకంటే శనీశ్వరుడు మనిషి చేసే కర్మలను బట్టి మంచి, చెడు ఫలితాలను ఇస్తాడు. అయితే కొంతమంది అంటే శనీశ్వరుడికి స్వతఃగానే ఇష్టమట.. వారిపై అనుగ్రహం ఎప్పుడు ఉంటుందట. అదే సమయంలో కొన్ని పనులు చేసేవారు శనీశ్వరుడి ఆశీర్వాదం ఎన్నటికీ పొందలేరట. పైగా శనిశ్వరుడి ఆగ్రహంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట.

Lord Shani: ఇటువంటి వ్యక్తులు జీవితంలో శనీశ్వరుడు అనుగ్రహం పొందలేరు.. ఎందుకంటే
Shani Dosha 2025
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 9:44 AM

Share

హిందూ మతంలో శనీశ్వరుడు ముఖ్యమైన దైవం. నవ గ్రహాల్లో ప్రముఖ స్థానం ఉంది. మనిషి చేసే కర్మ ఫలాలను ఇచ్చేవాడిగా.. న్యాయ దేవుడిగా భావిస్తారు. శనీశ్వరుడు ఆశీర్వాదం పొందడానికి శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అయితే శనీశ్వరుడు ఆశీర్వాదాలు ఎప్పటికీ పొందని వారు కొందరు ఉన్నారు. ఈ రోజు శనిశ్వరుడి అనుగ్రహం ఎప్పటికీ పొందని వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం..

ఈ వ్యక్తులపై శనీశ్వరుడు అనుగ్రహం ఉండదు..

  1. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇతరులను మోసం చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు లేదా తమ స్వార్థం కోసం ఎవరినైనా అవమానించే వారు శని దేవుడి అనుగ్రహం పొందరు.
  2. అదే సమయంలో జూదం ఆడేవారు, పందెం వేసేవారు, మాంసం, మద్యం సేవించేవారు కూడా శని దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఇటువంటి అలవాట్లు ఉంటే ఈరోజే వాటిని వదిలేయండి.
  3. కొన్ని రకాల పనులు చేసే వారు శనిశ్వరుడి చెడు దృష్టిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  4. మూగ జంతువులను వేధించే వారు శని దేవుడి భయంకరమైన ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
  5. పేదలను, మహిళలను, వృద్ధులను, నిస్సహాయులను వేధించే వారిపై శనిశ్వరుడి ఎప్పుడూ తన ఆశీస్సులను అందించడు. ఈ వ్యక్తులు జీవితాంతం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

శని దేవుని ఆశీస్సులు పొందడానికి ఏమి చేయాలంటే

మీరు శని దేవుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మంచి పనులు చేయడమే సులభమయిన మార్గం. శనివారం నాడు మీ శక్తి మేరకు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. అలాగే శనీశ్వరుడు ఆశీర్వాదం పొందడానికి హనుమంతుడిని పూజించండి. దీనితో పాటు శని దేవుడి ఆశీర్వాదం పొందడానికి.. శనివారం రావి చెట్టుకు నీరు అర్పించి, ఆ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు