AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2025: జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ సహా పూర్తి వివరాలు మీ కోసం

హిందువులు చేసే పవిత్రమైన తీర్ధయత్రాల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. తమ జీవితంలో ఒక్కసారైనా మంచు కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కష్ట తరమైన సరే అమర్ నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తాడు. ఈ అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్‌లో సుమారు 38888 మీటర్ల్ ఎత్తులో ఉంది. ప్రతి సంవత్సరం శివ భక్తులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సంవత్సరం ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? భక్తులు వెళ్లేందుకు ఎటువంటి రూల్స్ పాటించాలి తెలుసుకుందాం..

Amarnath Yatra 2025: జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ సహా పూర్తి వివరాలు మీ కోసం
Amarnath Yatra 2025
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 7:59 AM

Share

హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివయ్య భక్తులు ఈ యాత్ర కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అమర్‌నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్‌లో 3888 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహలో సహజంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. దీనిని హిందూ మతంలో శివుని చిహ్నంగా భావిస్తారు. శివలింగాన్ని పోలి ఉండే ఈ ఆకారం 15 రోజుల పాటు ప్రతిరోజూ కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది. అంటే 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువ అవుతుంది. తర్వాత 16వ రోజు నుంచి శివలింగం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంటే చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ శివలింగం పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమయ్యే కొద్దీ శివలింగం కూడా అదృశ్యమవుతుంది. ఈ గుహను 15వ శతాబ్దంలో ఒక ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025 సంవత్సరంలో అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. ఈ పవిత్ర ప్రయాణానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 24 నుంచి ఆన్‌లైన్ మోడ్ ద్వారా ప్రారంభమైంది. దీని కోసం యాత్రికులు శ్రీ అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. శ్రీ అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డుకు భారతదేశం అంతటా 540 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలు ఉన్నాయి. అక్కడ కూడా భక్తులు తమ పేరుని నమోదు చేసుకోవచ్చు.

అమర్‌నాథ్ యాత్ర 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

  1. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ సేవలపై క్లిక్ చేయండి.
  2. ట్రిప్ మెనూలో ట్రిప్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి, సూచనలన్నింటినీ జాగ్రత్తగా చదవండి. నిబంధనలను అంగీకరించి రిజిస్ట్రేషన్ కోసం కొనసాగండి.
  3. ఇవి కూడా చదవండి
  4. మీ పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మీ ప్రయాణ తేదీ వంటి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో , ఆరోగ్య ధృవీకరణ పత్రం స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
  5. మీ రిజిస్టర్డ్ నంబర్‌కు వచ్చిన OTPని షేర్ చేయడం ద్వారా మీ మొబైల్‌ను ధృవీకరించుకోండి. తరువాత రూ. 220 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
  6. చెల్లింపు పూర్తయిన తర్వాత మీరు మీ ప్రయాణ రిజిస్ట్రేషన్ అనుమతిని పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అమర్‌నాథ్ యాత్ర 2025 ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

అమర్‌నాథ్ యాత్రకు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ సెంటర్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళాల్సి ఉంది. సాధారణంగా యాత్రకు ఎంచుకున్న రోజుకు మూడు రోజుల ముందు వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ హాల్ వంటి ప్రదేశాలలో టోకెన్ ద్వారా స్లిప్‌లను పంపిణీ చేస్తారు. యాత్రికులు మర్నాడు అధికారిక రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షల కోసం సరస్వతి ధామ్‌కు వెళ్లాలి. యాత్రికులు జమ్మూలోని నిర్దిష్ట ప్రదేశాల నుంచి తమ RFID కార్డులను సేకరించాల్సి ఉంటుంది.

అమర్‌నాథ్ యాత్రకు కావలసిన పత్రాలు

  1. యాత్ర పర్మిట్, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికేట్, ఒక ఫోటో..
  2. అవసరమైన పత్రాల వివరాలు: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లడానికి ఈ పర్మిట్ తప్పనిసరి. ఇది శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ద్వారా జారీ చేయబడుతుంది.
  3. ఆధార్ కార్డు: గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది.
  4. మెడికల్ సర్టిఫికేట్: ఆరోగ్యంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఈ పత్రం అవసరం. ఇది ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యుడి నుంచి తీసుకోవాల్సి ఉంది.
  5. RFID కార్డ్- ప్రయాణానికి మీ దగ్గర RFID కార్డ్ ఉండాలి. ఇది భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది.
  6. యాత్ర పర్మిట్, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం కోసం ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం. యాత్ర రిజిస్ట్రేషన్ తర్వాత జారీ చేయబడుతుంది.
  7. అధికారిక సమాచారం కోసం ఆధార్ కార్డు, 6 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మొబైల్ నంబర్.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు