అక్షయ తృతీయ రోజున ఏర్పడనున్న శుభాయోగాలు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయడం శుభప్రదం అంటే..
హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే పనితో శాశ్వత ప్రయోజనాలు లభిస్తాయని అంటారు. ఈసారి అక్షయ తృతీయ రోజున అనేక అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా.. ఇంట్లో ఆనందం, శాంతి, సంపద ఉంటాయి.

హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలను చేయాలనుకున్నా శుభ సమయం కోసం చూడాల్సిన అవసరం లేదని.. ఈ రోజున సర్వార్థ సిద్ధి దినంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున, ముఖ్యంగా సూర్యుడిని, లక్ష్మీ దేవి, విష్ణువును పూజిస్తారు, ఇది జీవితంలో సానుకూలత, శ్రేయస్సును తెస్తుంది.
అక్షయ తృతీయ శుభ యోగం.. శుభ సమయం
ఈసారి అక్షయ తృతీయ రోజున సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం ఏదైనా పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. శోభన యోగం శుభాన్ని సూచిస్తుంది. రవి యోగం పనిలో విజయం, శ్రేయస్సును తెస్తుంది. ఈ మూడు యోగాల కలయిక అక్షయ తృతీయను అత్యంత ఫలవంతమైనదిగా చేస్తుంది. అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా.. ఒక వ్యక్తి లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందుతాడని నమ్ముతారు.
అక్షయ తృతీయ చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
- అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని పూజించడం చాలా ముఖ్యం. కనుక ఈ రోజున లక్ష్మీదేవితో పాటు, సంపదకు అధిపతి అయిన కుబేరుడిని ప్రత్యేక నియమ నిష్టలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని నమ్ముతారు.
- అక్షయ తృతీయ రోజున సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నీరు నింపండి. ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా జీవితంలో సానుకూల శక్తి నిలిచి ఉంటుందని.. సూర్యుడు జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాడని నమ్మకం.
- ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం, డబ్బులు పెట్టె లాకర్, పూజ గది, వంటగది, తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయని.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం.
- అక్షయ తృతీయ రోజున చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున బెల్లం, బియ్యం, బంగారం, నెయ్యి, నీరు, వస్త్రాలను దానం చేయండి. ఇది ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కాపాడుతుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








