AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం..ప్రపంచదేశాల మద్దతుతో ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు

పహల్గామ్‌ లో ఉగ్రదాడితో అందాల కశ్మీరం... అల్లకల్లోలంగా మారింది. ఉగ్రతూటాకు ఆ ప్రాంతం అల్లాడిపోయింది. ముష్కరుల రాక్షసకాండకు 26 మంది అమాయకులు బలయ్యారు. దీంతో భారత్‌, పాక్‌ మధ్య వివాదం మరింత ముదిరింది. భారత్‌ సరిహద్దుల్లో ఆయుధాలు సిద్ధం చేసుకుంటూనే... పాక్‌కు వెన్నులో వణుకుపుట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఖరాకండిగా పాక్‌తో దౌత్య సంబంధాలు తెంచేసుకుంది.

పాక్‌పై భారత్‌ దౌత్య యుద్ధం..ప్రపంచదేశాల మద్దతుతో ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు
Pahalgam Attack
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 7:17 AM

Share

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతోంది…? సర్జికల్‌ స్ట్రైక్‌కి మించి రివెంజ్‌ ఉంటుందా…? ప్రపంచం నివ్వెరపోయేలా ప్రతీకారం ఉంటుందన్న కేంద్రప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది…? ఇప్పుడివే అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. అటు ప్రజల నుంచి ఇటు సోషల్‌ మీడియాలోనూ ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం పాక్‌కు గట్టిగానే గుణపాఠం చెప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుని పాక్‌ను ఏకాకిని చేసేందుకు పక్కా ప్లాన్‌ రెడీ చేస్తోంది…!

ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్‌ పాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అటారీ చెక్‌పోస్ట్ మూసేస్తున్నట్లు తెలిపింది. పాకిస్తానీలకు ఇకపై వీసాలివ్వద్దని నిర్ణయించింది. స్పెషల్‌ వీసాలపై వచ్చిన వాళ్లూ వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేసింది. ఇటు హైకమిషన్ నుంచి ఐదుగురు పాక్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ని తీసివేయడంతో పాటు సిబ్బంది కుదించింది భారత్.

ఇవి కూడా చదవండి

పాక్‌ని ఏకాకిని చేసేందుకు మరో వ్యూహాన్ని అమలుచేయనుంది భారత్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ… భారత్‌పై కవ్వింపులకు దిగుతున్న పాక్‌ను ప్రపంచదేశాల మద్దతుతో ఒంటరిని చేయాలన్న ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడిని అమెరికా, రష్యా, చైనా, శ్రీలంక, ఇటలీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలుదేశాలు ఖండించాయి. ఉగ్రవాదుల ఏరివేతకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై పోరాటంలో మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. దీంతో ప్రపంచదేశాల సపోర్టుతో పాక్‌ను భారత్ ఒంటరిని చేసేందుకు ప్లాన్‌ రెడీ చేస్తోంది.

ఇటు జీ20 దేశాల రాయబారులతోనూ భారత విదేశాంగ శాఖ భేటీ అయ్యింది. దౌత్యవేత్తలకు పహల్గామ్ ఉగ్రదాడి గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు భారత విదేశాంగ అధికారులు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తున్న తీరును… భారత్‌పై పాక్ పదేపదే కవ్వింపులకు దిగుతున్న పరిణామాలను దౌత్యవేత్తలకు తెలియజేశారు. పాక్‌ కుట్రలను ఇటు అఖిలపక్ష సమావేశంలోనూ వివరించింది కేంద్రం. రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాక్‌ తీరుపై అన్నిపార్టీలు కన్నెర్ర చేశాయి. పాక్‌ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సైతం మద్దతిచ్చారు.

మొత్తంగా… పాక్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు, భారత్‌ వైపు చూడాలంటేనే వణుకుపుట్టేలా చేసేందుందుకు ఇంటా బయటా మద్దతు కూడగడుతోంది కేంద్రం. అలాగే ప్రపంచదేశాల సపోర్ట్‌తో పాక్‌ను ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నెక్ట్స్‌ ఏం జరగబోతోందో చూడాలి మరి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!