AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dried Lemon: నిమ్మకాయలు ఎండిపోయాయని పడేస్తున్నారా.. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని తెలుసా..

నిమ్మకాయలో పోషకాలు మెండు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. అయితే ఈ నిమ్మకాయతో అందానికి కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. అందుకనే నిమ్మరసం తీసిన తర్వత వాటి తొక్కలను స్కిన్ కు, జుట్టుకు ప్యాక్ గా తయారు చేసి అప్లై చేస్తారు. అయితే ఒకొక్కసారి నిమ్మకాయలు ఉపయోగించకుండానే ఎండిపోతాయి. అవి ఇక ఉపయోగపడవని పాడవేస్తారు. కానీ ఎండిన నిమ్మకాయలతో కూడా అనేక ప్రయోజనాలున్నాయని తెలుసా..

Dried Lemon: నిమ్మకాయలు ఎండిపోయాయని పడేస్తున్నారా.. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని తెలుసా..
Dried Lemon
Surya Kala
|

Updated on: Apr 25, 2025 | 8:43 AM

Share

వేసవి సీజన్ లో నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసాన్ని తాగుతారు. నిమ్మకాయలను తెచ్చుకుని నిల్వ చేస్తారు. ఐతే ఒకొక్కసారి ఎండ వేడికి నిమ్మకాయలు ఎండిపోతాయి. అప్పుడు ఎందుకూ పనికి రావు అంటూ పడేస్తారు. అలా ఎండిన నిమ్మకాయలతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ రోజు ఎండిన నిమ్మకాయలను మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం..

నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందం, ఆరోగ్యాన్ని ఇస్తుంది.. నిమ్మరసం చర్మానికి, జుట్టుకి మాత్రమే కాదు జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నిమ్మరసం తాగిన వెంటనే శరీరం చల్లబడుతుంది. మండే ఎండల సీజన్ లో ప్రతిరోజు నిమ్మరసం శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అదే విధంగా ఎండిన నిమ్మకాయ కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుంది.

గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ఎండిన నిమ్మకాయల వేసి కొంత సేపు నానబెట్టండి. ఇలా చేయడం వలన నిమ్మకాయ మెత్తబడుతుంది. ఇప్పుడు నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం పిండితే జ్యూస్ వస్తుంది. ఈ నిమ్మరసం ఫ్రెష్ జ్యూస్ లా ఉండకపోవచ్చు.. కానీ ఇలా తీసిన నిమ్మరసాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎండిన నిమ్మ కాయలతో అందానికి కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. నిమ్మకాయ చర్మం పై మంచి క్లెన్సర్‌లా పనిచేస్తుంది. కట్ చేసి నిమ్మ ముక్కతో ముఖంపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆయిలీ స్కిన్ యాక్నే ఎక్కువగా ఉన్నవారికి బెస్ట్ రెమెడీ.

ఎండిన నిమ్మకాయని జిడ్డుగా ఉండే ముఖానికి అప్లై చేయడం వలన ముఖంపై ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. నిమ్మకాయలో యాసిడిటీ గుణం ఉంది కనుక ఎండిన నిమ్మకాయని ముఖంపై సున్నితంగా ఉండే చోట అప్లై చేయవద్దు.

ఎండిన నిమ్మకాయలతో లెమన్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయని కట్ చేసి నిమ్మ టీ ని తయరు చేసుకోవచ్చు. ఇది మంచి ఆరోమాను కూడా అందిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బరువుని అదుపులో ఉంచుకోవాలి అనుకునేవారికి ఈ టీ మేలు చేస్తుంది.

ఎండిపోయిన నిమ్మకాయలతో కిచెన్ ను శుభ్రం చేసుకోవచ్చు. వంటింటి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ చెక్కమీద బేకింగ్ సోడా వేసి పాత్రలను శుభ్రం చేయడం వలన అవి తళతళ మెరిసిపోతాయి. అంతేకాదు ఈ నిమ్మ రసాన్ని పిండి నాచురల్ క్లెన్సర్‌లా తయారు చేసుకోవచ్చు.

ఫ్రిడ్జ్ ను ఫ్రెష్ గా ఉంచేలా ఎండిన నిమ్మ చేస్తుంది. ఎండిన నిమ్మకాయలను ఫ్రిడ్జ్ లోపల ఒక మూల పెట్టాలి.

ఇంట్లో డస్ట్ బిన్ దగ్గర నుంచి దర్వాసన రాకుండా ఉండాలంటే ఎండిన నిమ్మ కాయ పెట్టండి. ఇది సహజంగా దుర్వాసనను పీల్చుకుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)