- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips Saturday: Never purchase these 5 things on Saturday otherwise you will have to repent
Astro Tips Saturday: శనివారం రోజున ఈ వస్తువులను కొంటే ఆర్ధిక ఇబ్బందులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..
Astro Tips Saturday: శనివారం శనిశ్వరుడికి ప్రీతి కరమైన రోజు. ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందని నమ్మకం. అంతేకాదు శనివారం ఈ వస్తువులను కొంటె.. జీవితంలో అనుకోని సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
Updated on: Jan 22, 2022 | 2:55 PM

పప్పులకు సూర్యుడు, అంగారకుడికి మద్య సంబంధం ఉందని పెద్దల నమ్మకం. శనికి ఇద్దరికీ శత్రుత్వం ఉంది. శనివారం రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది. అంతేకాదు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

శనివారాల్లో ఉప్పు కొనడం కూడా నిషేధించబడింది. ఉప్పు కొనుగోలు చేయడం వలన ఇంట్లో రోగాలు వస్తాయని, అప్పులు పెరిగి అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం.

శనిశ్వరుడినికి ఆవాల నూనె చాలా ఇష్టం. అయినపట్టికీ శనివారం నూనె కొనుగోలు చేయకూడదు. ఇలా నూనె కొనుగోలు చేయడం వల్ల శారీరక బాధలు, రోగాలు వస్తాయని నమ్మకం. అయితే శనివారం రోజున శనికి ఆవనూనె నైవేద్యంగా పెట్టి ఆవనూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

శనివారం రోజున ఇనుప వస్తువులు కొనకండి. ఇనుప వస్తువులు శనివారం కొనుగోలు చేయడానికి బదులుగా.. ఇనుమును దానం చేయడం మంచిది

శనివారం నాడు తోలు లేదా తోలుతో చేసిన బూట్లు, బెల్టులు, పర్సులు మొదలైన వాటిని కొనకూడదు. వీటిని కొనడం వల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయని, చేపట్టిన ప్రతి పనిలో ఆటంకం కలుగుతుందని నమ్ముతారు.

(రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




