Astro Remedy For Marriage: వివాహం ఆలస్యం అవుతుందా.. అయితే ఈ 5 జ్యోతిష్య పరిహారాలు పాటించి చూడండి..
Astro Remedy For Marriage: గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు వివాహం ఆలస్యం అవుతుంది. పదే పదే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా పెళ్లి ప్రయత్నాలు సఫలమవ్వవు. అటువంటి పరిస్థితిలో.. కొన్ని జ్యోతిష్య నివారణలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే.. ఈ జ్యోతిష్య పరిహారాలను ప్రయత్నించి చూడండి.
వాస్తు ప్రకారం.. వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి గది ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉండాలి. ఇది సాధ్యం కాకపోతే, ఉత్తర దిశలో గదిని ఉండాలి. అంతేకాదు బెడ్ రూమ్ లో మంచాన్ని గోడకు అతుక్కునేలా వేసుకోకూడదు. .
1 / 6
గురువారం నాడు, విష్ణువుకి పూజించండి. ఉపవాసం పాటించండి.అంతేకాదు అరటి చెట్టును పూజించండి. పసుపును దానం చేయండి, బియ్యం పిండిలో బెల్లం, పసుపు , శెనగపిండి కలిపి ఆవుకు ఆహారంగా పెట్టండి. బృహస్పతి పేరుని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల వివాహ అవకాశాలు బలపడతాయి.
2 / 6
వివాహానికి సంబంధించిన ప్రతి సమస్యకు ఆరు ముఖి రుద్రాక్ష ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కార్తికేయని రూపంగా పరిగణించబడుతుంది. దీన్ని ధరించడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
3 / 6
ప్రతిరోజూ శివలింగాన్ని పూజించి.. పచ్చి పాలు, బెండకాయలు, నీరు మొదలైనవి సమర్పించి, భగవంతునికి మీ కోరికను చెప్పండి. త్వరలో వివాహానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అమ్మాయిలు అయితే 16 సోమవారాలు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
4 / 6
ఏదైనా పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. దీని వల్ల వివాహానికి వచ్చే అడ్డంకులు త్వరగా తొలగిపోయి పెళ్లి కుదురుతుంది.