- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips in telugu these five thing spread negative energy in your house
Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులను ఉంచడం వలన ఆర్ధిక ఇబ్బందులు, వివాదాలు ఏర్పడతాయి.. అవి ఏమిటంటే
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం ఇంట్లో వివాదాలు ఏర్పడవచ్చు. ఆర్ధికంగా ప్రభావం చూపించవచ్చు, కనుక ఇంట్లో వీటిని పెట్టుకోవద్దు అని జ్యోతిష్యులు చెప్పారు. అవి ఏంటో తెలుసుకుందాం
Updated on: Jan 21, 2022 | 3:05 PM

వాస్తు ప్రకారం.. కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను గదిలో, పడకగదిలో, ప్రధాన ద్వారంలో పెంచకూడదు. ఈ మొక్కలు దాంపత్య సుఖంపై ప్రభావం చూపిస్తాయి. ముళ్ల మొక్కలు ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. అయితే వీటిని ఇంటి బయట పెంచుకోవచ్చు.

వాస్తు ప్రకారం కప్పులు లేదా ప్లేట్లలో పగుళ్లు ఉంటే.. వాటిని ఉపయోగించవద్దు. అలా చేయడం అశుభం అని భావిస్తారు. పగిలిన ప్లేట్లలో ఆహారం తినడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వైఫల్యాలు వస్తాయి. అంతేకాదు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపించవచ్చు.

వాస్తు ప్రకారం, బెడ్ రూమ్ మధ్యలో టెలివిజన్ పెట్టకూడదు. భార్య భర్తల మధ్య పరస్పర వివాదాలకు కారణం కావచ్చు. అయితే పడక గదిలో టీవీని ఉంచాలనుకుంటే.. దానిని ఆగ్నేయ మూలలో ఉంచవచ్చు.

వాస్తు ప్రకారం, ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచడం అశుభం. ఆగిపోయిన గడియారం ప్రాథమికంగా జీవితంలో చిక్కులు ఏర్పడి ముందుకు సాగడం లేదని చిహ్నం. అంతేకాదు సంబంధాలు, వృత్తి లేదా ఆర్థిక విషయాలలో పురోగతి లేకపోవడానికి కూడా కారణం కావచ్చు.

వాస్తు ప్రకారం ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. అవి ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి. అందుకనే ఇంట్లో పెంచుకునే మొక్కలన్నీఎలాంటి స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ మొక్కలు సానుకూలతను తెలియజేస్తాయి. కనుక వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలి.

రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.




