Budget 2022: ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్ పరిమితి పెరగనుందా.. బడ్జెట్‌ 2022లో ఎలాంటి నిర్ణయం రానుంది?

Industry Budget 2022: ఈ పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Budget 2022: ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్ పరిమితి పెరగనుందా.. బడ్జెట్‌ 2022లో ఎలాంటి నిర్ణయం రానుంది?
pf
Follow us
Venkata Chari

|

Updated on: Jan 22, 2022 | 11:49 AM

Industry Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 (Budget 2022)ను ఫిబ్రవరి1న ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు అన్ని రంగాల్లో ఎన్నో ఆశలు నెలకొలన్నాయి. అయితే తాజాాగా ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్ పరిమితిని పెంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గుడ్‌న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం బడ్జెట్‌లో పరిమితిని ప్రకటించిన తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 23, 2021న లోక్‌సభలో మాట్లాడుతూ, “ పిఎఫ్‌లో రూ. 2.5 లక్షల చందాపై విధించిన ఆదాయపు పన్ను ప్రశ్నను నేను పరిష్కరించాలనుకుంటున్నాను. రూ. 2.5 లక్షల పరిమితి మెజారిటీ ప్రజలకు వర్తిస్తుంది. చిన్న, మధ్యస్థ పన్ను చెల్లింపుదారులపై ఈ ప్రభావం ఉండదు. యజమాని సహకారం లేని చోట పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని భావిస్తున్నాం” అని ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లాభం చేకూరనుందని, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఈ పరిమితి అందరికి అనుకూలంగా రానున్నట్లు తెలుస్తోంది.

పన్ను నిపుణులు, పీఎఫ్ నిపుణులు, మాట్లాడుతూ, ఈ పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. ఇది వివక్షాపూరితమైనది అంటూ విమర్శలు గుప్పించారు. “బడ్జెట్ 2021 తరువాత, ప్రభుత్వం తదుపరి సవరణను ప్రకటించింది. దీనిలో పీఎఫ్ సహకారం లేని ఫండ్‌కు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తే పన్ను రహిత వడ్డీ ఆదాయం కోసం ఈ పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు రెట్టింపు చేసింది. అందువల్ల, సాధారణ ప్రావిడెంట్ ఫండ్ (GPF)కి చేసిన జమలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యజమాని సహకారం లేని చోట ఈ పరిమితి రూ. 5 లక్షలకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల, ప్రభుత్వ ఉద్యోగులకు, పన్ను రహిత వడ్డీ ఆదాయానికి పరిమితి రూ. 5 లక్షలుగా ఉంది” అని నిపుణులు అంటున్నారు.

పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగుల, యాజమాన్యాల వాటా కలిపి ఏడాదిలో రూ.2.50 లక్షలకు మించి జమ అయితే దానిపై లభించే వడ్డీకి పన్ను పడుతుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. “అందరి ప్రయోజనాల కోసం, ప్రత్యేకించి ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం, ఉద్యోగి, యజమాని జమలను కాస్ట్-టు-కంపెనీ (CTC)లో చూపిస్తారు. యజమాని సహకారం ఎల్లప్పుడూ ఈ CTCలో భాగంగా ఉంటుంది. అందువల్ల, దీనిని పరిశీలించాలని” కోరుతునట్లు తెలిపారు.

రూ.2.50 లక్షల కంటే తక్కువ పీఎఫ్‌ను ఏటా జమ చేసేవారు 92-93 శాతం వరకు ఉంటారని, వీరందరికి పన్ను రహిత వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. “ఈ సవరణ ఏప్రిల్ 1, 2021న లేదా ఆ తర్వాత చేసిన కంట్రిబ్యూషన్‌లకు వర్తిస్తుంది. అంతకుముందు చేసిన జమలు, వడ్డీలపై ప్రభావితం చూపదు” అని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Budget 2022: కరోనాతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికులు బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు?

Income Tax: మీ తల్లిదండ్రుల ద్వారా పన్ను ఆదా ప్రయోజనం పొందడం ఎలా.. సులువైన మార్గాలు..!