AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wigs: మార్కెట్లో విగ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. తయారు చేయడానికి 6 నెలల సమయం.. పూర్తి వివరాలు..!

Wigs: ప్రస్తుతం కాలుష్యం కారణంగా, ఒత్తిడి, ఇతర కారణాలతో చాలా మంది జుట్టు ఊడిపోతుంటుంది. చివరికి బట్టతల అయ్యే పరిస్థితి..

Wigs: మార్కెట్లో విగ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. తయారు చేయడానికి 6 నెలల సమయం.. పూర్తి వివరాలు..!
Subhash Goud
|

Updated on: Jan 27, 2022 | 7:03 AM

Share

Wigs: ప్రస్తుతం కాలుష్యం కారణంగా, ఒత్తిడి, ఇతర కారణాలతో చాలా మంది జుట్టు ఊడిపోతుంటుంది. చివరికి బట్టతల అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రజల్లో బట్టతల సమస్య పెరుగుతుండడంతో తలపై ఫేక్ హెయిర్‌ను అమర్చే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. దీన్ని సిద్ధం చేయడం అంత తేలికైన పని కాదు. విగ్ తయారీలో ఎక్కువ భాగం చేతితో తయారు చేయడం జరుగుతుందని, అందువల్ల చాలా సమయం పడుతుందని ఇన్‌సైడర్ నివేదిక చెబుతోంది. ఒకే జడలో ఉన్న జుట్టును విగ్‌గా మార్చడానికి 50 గంటల నుండి 6 నెలల వరకు పట్టవచ్చని చెబుతున్నారు.

నివేదిక ప్రకారం.. విగ్ రెండు విధాలుగా తయారు చేస్తారు. కృత్రిమంగా తయారు చేయబడిన పాలిస్టర్ జుట్టు నుండి మొదటిది. రెండవది మానవులు విక్రియించడం, దానం చేసిన జుట్టు నుండి తయారు చేస్తారు. మనిషి వెంట్రుకలతో తయారు చేయబడిన విగ్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఇది పూర్తిగా అసలైన రూపాన్ని కలిగి ఉండటం వలన వాటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

మానవుల నుంచి సేకరించిన జుట్టు నుంచే విగ్గు తయారీ:

కాగా, మానవుల నుంచి సేకరించిన జుట్టుతోనే ముందు విగ్గును తయారు చేస్తారు. సేకరించిన వెంట్రుకలు చిన్నగా ఉండటం, లేదా దెబ్బతిన్నవి ఉండటం ఉండకూడదు. పొడవుగా ఉన్న జుట్టును విగ్గుకు అనుగుణంగా కత్తిరిస్తారు. ఆ తర్వాత వాటిని కడుగుతారు. వాటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే సమస్య ఏర్పడుతుంది. అందుకే మంచి జుట్టును మాత్రమే తీసుకుని తయారు చేస్తారు.

విగ్‌ తయారు చేయాలంటే కష్టతరమైన పని. జుట్టు పూర్తిగా తలకు అతుక్కునేలా తయారు చేయబడి ఉంటుంది. తలకు జుట్టు పూర్తిగా అతుక్కునే విధంగా సూదులను ఉపయోగిస్తారు. మొత్తం విగ్గులో వెంట్రుకలు సుమారు 30 నుంచి 40 వేల వరకు ఉంటాయి. పొట్టి జుట్టు గల విగ్‌లు పురుషుల కోసం తయారు చేయబడతాయి. అయితే మహిళలకు విగ్‌లను తయారు చేయడానికి జుట్టు కనీసం 8 అంగుళాల పొడవు ఉండాలి. జుట్టు దీని కంటే పొట్టిగా ఉంటే దానిని ఉపయోగించరు. కొన్ని కొన్ని వెంట్రుకలు పొడవుగా, కొన్ని కొన్ని పొడవుగా ఉంటాయి. ఇలా విగ్గులోని వెంట్రుకలు సమాంతరంగా చేసి తయారు చేయడం కొత్త కష్టతరమైన పని అవుతుంది. ఇలా ఒరిజినల్‌ జుట్టులా ఉండే విగ్గును తయారు చేయాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటుందని నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి

Dead Person Fingerprint: ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు మరణించిన వ్యక్తి ఫింగర్‌ ప్రింట్‌ ఎందుకు పని చేయవు.. వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..?

Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!