Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?

Pickles: చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త మరింత అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కరోనా సమయంలో డైట్‌లో అనేక రకాల

Pickles: చలికాలం పచ్చళ్లు ఎక్కువగా తింటున్నారా.. కొంచెం ఈ విషయాలపై ఓ లుక్కేయండి..?
Pickles
Follow us
uppula Raju

|

Updated on: Jan 27, 2022 | 6:55 AM

Pickles: చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త మరింత అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కరోనా సమయంలో డైట్‌లో అనేక రకాల సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోవాలి. ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి ఉండాలి. వీటితో పాటు ఊరగాయ తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే దీర్ఘకాలికంగా ఉండే పచ్చళ్లకి మాత్రం దూరంగా ఉండాలి. స్వల్పకాలిక పచ్చళ్లు తింటే మంచిదే. పచ్చళ్లు ఎప్పుడైనా వంటకం రుచిని రెట్టింపు చేస్తాయి. మీరు చలికాలంలో రుచికరమైన క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ వంటి ఊరగాయను ఆస్వాదించవచ్చు. ఈ పచ్చళ్లు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చలికాలంలో కర్రీతో పాటు స్వల్పకాలిక పచ్చళ్లు తినడం మంచిదే. ఇవి జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఊరగాయ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, నూనెతో తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉసిరి, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉన్నందున జీర్ణక్రియకు ప్రయోజనం చేకూరుస్తాయి. చలికాలంలో తయారుచేసిన ఊరగాయలు డయాబెటిక్ రోగులలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ ఊరగాయలు కాలేయానికి మంచివిగా భావిస్తారు. ఇవి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.

రుబ్బిన మసాలాలు ఉపయోగించడం వల్ల పచ్చళ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఊరగాయలలో ఆవాలు వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలను అధిగమించవచ్చు. టర్నిప్‌లు, క్యారెట్లు, కాలీఫ్లవర్‌లను సూర్యకాంతిలో ఉంచడం వల్ల పోషక విలువలు బాగా పెరుగుతాయి. మీరు పరోటాలు, పప్పు, అన్నం, కిచ్డీలతో ఊరగాయను ఆస్వాదించవచ్చు. సీజన్‌కు అనుగుణంగా ఉండే ఊరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కానీ ధీర్ఘకాలిక పచ్చళ్లకు మాత్రం దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావని గుర్తుంచుకోండి.

Viral Photos: కోహినూర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?

ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు.. ఆరోగ్యానికి హానికరం..?

Republic Day 2022: రిపబ్లిక్ డే గురించి చాలామందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు..?